Home /News /jobs /

DRDO IS HIRING FOR JUNIOR RESEARCH FELLOW POSITIONS WITH DIRECT INTERVIEW EVK

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వార ఎంపిక

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బెంగుళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defense Research and Development Organisation) లో జూనియర్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఎంఫిక నిర్వహిస్తారు.

    బెంగుళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defense Research and Development Organisation) లో జూనియర్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. DRDO రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్(Notification) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు ఫెలోషిప్ చేయవచ్చు. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఫెలోషిప్ కాల పరిమితిని పెంచే అవకాశం ఉంది. బాగా పని చేసిన వారిని సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అప్‌గ్రేడ్(Upgrade) చేస్తారు. జూనియర్ ఫెలోషిప్(Fellowship) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,000 జీతం లభిస్తుంది.

    అర్హతలు.. ఖాళీల వివరాలు





















    పోస్టుఖాళీలుఅర్హతలువయోపరిమితి
    జూనియర్ రీసర్జ్ ఫెలో (మ్యాథమెటిక్స్)01మ్యాథమెటిక్స్ లో మాస్టర్ డిగ్రీ  ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసి ఉండాలి.  లేదా  మ్యాథమెటిక్స్, కప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. కచ్చింగా NET లేదా  GATE పాసై  ఉండాలి.28  ఏళ్లకు మించి ఉండకూడదు
    జూనియర్ రీసర్జ్ ఫెలో ( కంప్యూర్ సైన్స్)01కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. కచ్చింగా NET లేదా  GATE పాసై  ఉండాలి. లేదా  సంబంధిత రంగంలో మాస్టర్ డిగ్రీ చేయాలి (ఎంఈ)28  ఏళ్లకు మించి ఉండకూడదు

    దరఖాస్తుదారులు క్రిప్టోగ్రఫీ, కోడింగ్ సిద్ధాంతం మరియు ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం కలిగి ఉండటం కూడా మంచిది. వారికి తగిన ప్రాధాన్యత(Prioity) ఉంటుంది.

    NCRTC Recruitment 2021: ఎన్‌సీఆర్‌టీసీలో 226 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి


    దరఖాస్తు చేసుకొనే విధానం..
    - ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్లో తమ అర్హతలను పరిశీలించుకోవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
    - నోటిఫికేషన్లో ఉన్న దరఖాస్తు ఫాంను డౌన్లోడ్ చేసుకొని నింపాలి.
    - దరఖాస్తు నింపడం పూర్తయ్యాకా స్కాన్ కాపీని ముందుగా jrfcair2021@gmail.com కు 8 అక్టోబర్ 2021 - సాయంత్రం 5 గంటలకు ముందు పంపాలి.
    - ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 18 మరియు 19 అక్టోబర్ 2021 న
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సెంటర్ (CAIR),
    DRDO కాంప్లెక్స్,
    CV రామన్ నగర్
    బెంగళూరు 560093 లో నిర్వహించబడతాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు