డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ లాబొరేటరీలో తన ప్రాజెక్ట్ కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ఆధారంగా ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ (Chemistry), మెకానికల్ బ్రాంచ్‌లలో 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిసెంబరులో జరగనున్న వాక్-ఇన్-ఇంటర్వ్యూ (Walk In Interview) కోసం అవసరమైన అన్ని అర్హత ప్రమాణాలతో అభ్యర్థులు ఆహ్వానించబడ్డారు. ఫిజిక్స్ బ్రాంచ్‌కు డిసెంబర్ 6, 2021న, కెమిస్ట్రీకి డిసెంబర్ 7, 2021న, ఎలక్ట్రానిక్స్‌కు డిసెంబర్ 8, 2021న, మెకానికల్‌కు డిసెంబర్ 9, 2021న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/careers ను సందర్శించాల్సి ఉంటుంది.
అర్హతలు..
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా మొదటి డివిజన్‌తో సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ (MSc లేదా తత్సమానం) కలిగి ఉండాలి.
JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
- CSIR-UGC (NET), MHRD (GATE) లేదా JEST ద్వారా నిర్వహించబడే జాతీయ అర్హత పరీక్ష (NET)లో ఉత్తీర్ణులై ఉండాలి.
- NET/GATE అర్హత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (ME/MTech)తో మొదటి డివిజన్‌తో సంబంధిత స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు.
- ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..
- ఆధార్ కార్డ్
- వయస్సు ధ్రువీకరణ కోసం 10వ తరగతి మార్క్‌షీట్.
Amazon Jobs: మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా.. అయితే వర్క్ ఫ్రం హోం ట్రై చేయండి
- క్లాస్ 12వ తరగతి మార్క్ షీట్
- గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్ మార్క్ షీట్ మరియు డిగ్రీ సర్టిఫికెట్
- మాస్టర్స్/ME/MTech మార్క్ షీట్ మరియు డిగ్రీ సర్టిఫికేట్
- బయోడేటా
- ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు.
Laptop Tips: ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!
ఇంటర్వ్యూ స్థలం..
“అర్హత ఉన్న అభ్యర్థి పైన పేర్కొన్న తేదీలో 10:00 గంటలకు 10:00 గంటలకు
డిఫెన్స్ లాబొరేటరీ,
రతనాడ ప్యాలెస్,
జోధ్‌పూర్-342 011 (రాజస్థాన్)కు రావాలలి. ఎంపికైన అభ్యర్థులను రెండేళ్లు కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోవాలి.
- ఎంపికైన అభ్యర్థులందరికీ HRA, వైద్య సదుపాయాలతో పాటు నెలవారీ రూ.31,000 స్టైఫండ్‌ను అందజేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DRDO, Govt Jobs 2021, Job notification, JOBS