డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (Defence Institute of Advanced Technology) జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం డీఆర్డీఓ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ప్రస్తుతం డీఆర్డీఓ(DRDO) "వేర్ స్టడీస్ ఆఫ్ హై ఎంట్రోపీ అల్లాయ్స్" అనే ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ యొక్క మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం (Department of Metallurgical and Materials Engineering)లో ఈ రీసెర్చ్ ఫెలో అవసరం ఉంది. ఎంపికైన అభ్యర్థి ఒక సంవత్సరం పాటు విధులు నిర్వర్తించాలి. ఏడాది పాటు నెలకు రూ.31,000 జీతం ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడండి. దరఖాస్తు విధానం, అర్హతలు తెసుకోనేందుకు చదవండి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.drdo.gov.in/careers ను సందర్శించండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు | జీతం |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంఎస్సీ చేసి ఉండాలి. గేట్(GATE), నెట్(NET) స్కోర్ పరిగణలోకి తీసుకొంటారు. మెటీరియల్ సైన్స్ లో స్పెషలైజేషన్ ఉండలి | 01 | రూ.31,000 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్) |
MG University: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
- నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు తప్పని సరిగా ఉండాలి.
- గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో చేస్తున్న వ్యక్తి నిబంధనలకు అనుగుణంగా పీహెచ్డీ(Phd) చేయవచ్చు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా(Bio Data)తో ఫాంను రూపొందించి సంతకం చేయాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- వారి విద్యార్హతల సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీ(Soft copy)లను తయారు చేసుకోవాలి.
- ఈ సాఫ్ట్ కాపీని thangaraju@diat.ac.in మెయిల్ ఐడీ(Mail Id)కి పంపాలి.
- అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి తదుపరి రౌండ్‌కి ఎంపిక చేస్తారు.
- వాక్ ఇన్ లేదా వీడియో ఇంటర్వ్యూ అనేది సంస్థ నిర్ణయిస్తుంది.
- ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులకు టీఏ/డీఏ(TA/DA)లు సంస్థ చెల్లించదు.
- ఎంపికైన వారికి వ్యక్తిగతంగా మెయిల్ వస్తుంది.
- ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 26,2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, DRDO, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS