DRDO 2019: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

DRDO Recruitment 2019 | బెంగళూరులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ rac.gov.in లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: October 18, 2019, 4:57 PM IST
DRDO 2019: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO 2019: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 18, 2019, 4:57 PM IST
తగిన అర్హతలు ఉండి, పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఇలాంటివారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO నిత్యం జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల్ని భర్తీ చేస్తూనే ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బెంగళూరులో డీఆర్‌డీఓకు చెందిన ల్యాబరేటరీ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-ADE సంస్థ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. బెంగళూరులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ rac.gov.in లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి డీఆర్డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 10

రీసెర్చ్ అసోసియేట్- 1
జూనియర్ రీసెర్చ్ ఫెలో- 9
స్టైపెండ్: రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.54,000, జేఆర్ఎఫ్‌కు నెలకు రూ.31,000.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 30
Loading...
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 20
రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 6
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 5, 6
వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్:
ADE, DRDO,
Raman Gate, Suranjandas Road,
New Thippasandra Post,
Bengaluru- 560075.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: కొంకణ్ రైల్వేలో ట్రైనీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...