హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DRDO Apprentice Recruitment 2021: డీఆర్డీఓలో అప్రంటీస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక..

DRDO Apprentice Recruitment 2021: డీఆర్డీఓలో అప్రంటీస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి అప్రంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.

నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఆసక్తి కలగిన అభ్యర్థులు మే 17లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో సూచించిన అన్ని డాక్యుమెంట్లును పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐటీఐ పాస్ అయిన వారు ఈ అప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.

NTPC Recruitment 2021: మహిళల కోసం ఎన్టీపీసీ నుంచి స్పెషల్ జాబ్ నోటిఫికేషన్.. ఆ స్కోర్ ఉంటే చాలు.. వివరాలివే

ఖాళీల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిట్టర్-14 ఖాళీలు

మెషినిస్ట్-6

టర్నర్-4

కార్పంటర్-3

ఎలక్ట్రీషియన్-10

ఎలక్ట్రానిక్స్ మెకానిక్-9

మెకానిక్(మోటార్ వెహికిల్)-3

వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-7

కంప్యూటర్ అండ్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపైర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్-2

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)-5

డిజిటల్ ఫొటోగ్రాఫర్-6

సెక్రటేరియల్ అసిస్టెంట్-8

స్టేనోగ్రాఫర్(హిందీ)-1

స్టేనోగ్రాఫర్(ఇంగ్లిష్)-1

సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. క్వాలిఫైయింగ్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఒక వేళ ఇద్దరు అభ్యర్థులు సమానమైన మార్కులు సాధిస్తే కింది తరగతుల్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 8500 చొప్పున స్కాలర్ షిప్ అందిస్తారు.

Notification-Direct Link

అభ్యర్థుల ఎంపిక..

అభ్యర్థులు NAPS పోర్టల్ (apprenticeshipindia.org) ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే సమయంలో సూచించిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కాన్ చేసిన టెన్త్, ఐటీఐ సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు, ఐటీ ప్రూఫ్, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్లను ఒకే పీడీఎఫ్ ఫైల్ లో పొందు పరిచి admintbrl@tbrl.drdo.inకు మే 17లోగా ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

First published:

Tags: DRDO, Government jobs, Job Mela, Job notification

ఉత్తమ కథలు