DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 జాబ్స్... మార్చి 23 చివరి తేదీ

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 జాబ్స్... మార్చి 23 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2020 | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 116 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

  • Share this:
    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    DRDO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    కార్పెంటర్- 2
    కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 23
    డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 5
    ఎలక్ట్రీషియన్- 20
    ఎలక్ట్రానిక్స్- 2
    ఫిట్టర్- 33
    మెషినిస్ట్- 11
    మెకానిక్ (మోటార్ వెహికిల్)- 5
    పెయింటర్- 2
    ప్లంబర్- 2
    టర్నర్- 5
    వెల్డర్- 6

    DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 2
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23
    విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
    వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే

    Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

    Govt Jobs: కరోనా ఎఫెక్ట్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త షెడ్యూల్
    Published by:Santhosh Kumar S
    First published: