హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DRDO Recruitment 2021 : డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో 90 అప్రెంటీస్ పోస్టులు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

DRDO Recruitment 2021 : డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో 90 అప్రెంటీస్ పోస్టులు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Apprentice Recruitment 2021 : ఉద్యోగాల భర్తీకి డీఆర్‌డీఓ హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 90 అప్రెంటీస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  హైద‌రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకీ నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 90 టెక్నిషియన్లు మరియు ఇంజనీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి సంవ‌త్స‌రం పాటు కాంట్రాక్టు ఉంటుంది. ఎంపిక విధానం అకాడ‌మిక్ మెరిట్ లేదా రాత ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా నిర్వ‌హిస్తారు. ట్రేడ్‌ అప్రెంటీస్‌ (Trade Apprentice) ల‌కు నెలకు రూ .7,700 నుంచి 8050, టెక్నీషియన్ అప్రెంటీస్‌లకు రూ .8000 చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల కోసం ఎంపికైన వారికి నెలకు రూ .9000 వేత‌నం చెల్లిస్తారు. ఆస‌క్తిక గల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు కోసం అధికారిక https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

  పోస్టుల స‌మాచారం..


  ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల‌కు అర్హ‌త ఖాళీలు

  పోస్టు  అర్హ‌త‌ఖాళీలు
  ఫిట్టర్‌ ఐటీఐ20
  ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌ ఐటీఐ08
  ఎలక్ట్రీషియన్‌ ఐటీఐ12
  కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ఐటీఐ03
  టర్నర్‌ ఐటీఐ03
  ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్రాసెసర్‌ ఐటీఐ04


  Telangana : కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌ను సంద‌ర్శించ‌నున్న ఎన్ఎమ్‌సీ.. వివ‌రాలు ఇవే..


  గ్రాడ్యుయేష‌న్ అప్రెంటీస్ అర్హ‌త‌.. పోస్టులు

  పోస్టు  అర్హ‌త‌ఖాళీలు
  కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్‌03
  ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌03
  ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌05
  మెకానికల్ ఇంజనీరింగ్‌16
  కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌02
  ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌01


  టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాల అర్హ‌త‌..

  పోస్టు  అర్హ‌త‌ఖాళీలు
  కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్‌లో డిప్లొమా01
  ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ02
  డిగ్రీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్02
  మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ04
  ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ01


  ISRO Courses : గ్రాడ్యుయేట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఇస్రోలో రిమోట్‌సెన్సింగ్‌పై రెండు నెల‌ల‌ కోర్సుకు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1: అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2: హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.

  Step 3: అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  Step 4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు వేచిచూడాలి.

  Step 5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తైన తర్వాత మళ్లీ hhttps://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

  Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

  Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

  Step 9: డీఆర్డీఓ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

  Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

  Step 11: అంతే కాకుండా అప్లికేష‌న్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేష‌న్‌లో ఉంచారు. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 12: ద‌రాఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: DRDO, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు