DRDO పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 25గా నిర్ణయించబడింది. పోస్టుల వివరాలిలా..
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 10 పోస్టులు
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 06 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 08 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ - 08 పోస్టులు
లైబ్రరీ సైన్స్ - 02 పోస్ట్‌లు
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 06 పోస్టులు
డిప్లొమా అప్రెంటిస్..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 04 పోస్టులు
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 04 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 04 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ - 04 పోస్టులు
లైబ్రరీ సైన్స్ - 01 పోస్ట్
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ - 03 పోస్టులు
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి TA/DA చెల్లించబడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ప్రకారం నెలకు రూ. 8,000-9,000 ఇవ్వబడుతుంది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 25 నవంబర్ 2022లోపు అధికారిక సైట్ www.drdo.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apprenticeship, JOBS