DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2021 | హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ-DRDL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ-DRDL కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 14 చివరి తేదీ. దరఖాస్తుల్ని చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    DRDO DRDL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    జూనియర్ రీసెర్చ్ ఫెలో మొత్తం ఖాళీలు- 10
    మెకానికల్ ఇంజనీరింగ్- 7
    ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్- 3

    IAF AFCAT 2 Recruitment 2021: ఎయిర్‌ఫోర్స్‌లో 334 జాబ్స్... డిగ్రీ పాస్ అయితే చాలు

    Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

    DRDO DRDL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 మే 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 14
    విద్యార్హతలు- జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. జేఆర్ఎఫ్ ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పోస్టుకు ఆ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.
    వయస్సు- 28 ఏళ్లు
    వేతనం- రూ.31,000 + హెచ్ఆర్ఏ

    India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే

    Teacher Jobs 2021: మొత్తం 7,236 టీచర్ పోస్టుల ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు

    DRDO DRDL Recruitment 2021: దరఖాస్తు విధానం


    అభ్యర్థులు ముందుగా https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    అందులో కెరీర్స్‌ సెక్షన్‌లో నోటిఫికేషన్ ఉంటుంది.
    నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
    అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తు ఫామ్‌ను పోస్టులో పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    The Director, DRDL,
    Dr. APJ Abdul Kalam Missile Complex,
    Kanchanbagh PO, Hyderabad – 500058
    Published by:Santhosh Kumar S
    First published: