DRDO DMRL Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తైందా? హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ మెటల్లార్జికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DMRL కోసం పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF, రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టు మొదట రెండేళ్లకు ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. ఇక రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టు రెండేళ్లకు మాత్రమే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 2 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోగా ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి admin@dmrl.drdo.in మెయిల్ ఐడీకి చివరి తేదీలోగా పంపాలి.
DRDO DMRL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 2
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ డివిజన్లో పాస్ కావాలి. జేఆర్ఎఫ్ పోస్టుకు బీటెక్ లేదీ బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేనాటికి కోర్సు పాస్ కావాలి. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు- ఇంటర్వ్యూ తేదీ నాటికి జేఆర్ఎఫ్ పోస్టుకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూ
ఫెలోషిప్- జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుకు రూ.31,000. రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుకు రూ.54,000.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.