• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DRDO DEAL RECRUITMENT 2021 DEFENCE RESEARCH AND DEVELOPMENT ORGANISATION RELEASED JOB NOTIFICATION FOR 71 VACANCIES SS

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO DEAL Recruitment 2021 | అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. డెహ్రడూన్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబరేటరీ-DEAL కోసం మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డీఆర్‌డీఓ. మొత్తం 71 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి ఏడాది పోస్టులు మాత్రమే. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా పూర్తి పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    MES Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 502 పోస్టులకు మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ జాబ్ నోటిఫికేషన్

    Jobs: హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

    DRDO DEAL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    అప్రెంటీస్ ఖాళీలు మొత్తం- 71

    డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ- 24
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 7
    మెకానికల్ ఇంజనీరింగ్- 4
    కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్- 13

    ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ- 47
    ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 24
    మెషినిస్ట్- 7
    టర్నర్- 6
    ఫిట్టర్- 10

    Police Jobs: పోలీస్ ఉద్యోగం మీ కలా? నోటిఫికేషన్ వచ్చేస్తోంది... రెడీగా ఉండండి

    Jobs for 10th Passed: ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ టెన్త్, ఇంటర్ పాస్ అయినవారికే... వెంటనే అప్లై చేయండి

    DRDO DEAL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 12 సాయంత్రం 5 గంటలు
    విద్యార్హతలు- డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేయాలి.
    వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు విధానం- డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌ http://portal.mhrdnats.gov.in/ లో అప్లై చేయాలి. ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ పోర్టల్‌లో అప్లై చేయాలి.
    అప్రెంటీస్ కాలం- 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31
    స్టైపెండ్- డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీకి రూ.8000, ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీకి రూ.7000
    Published by:Santhosh Kumar S
    First published: