హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Government Jobs 2022: 1000 పోస్టులకు ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. దరఖాస్తు చేసుకోండిలా..

Government Jobs 2022: 1000 పోస్టులకు ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. దరఖాస్తు చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) రిక్రూట్‌మెంట్ చేపట్టింది. సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM).. తాజాగా అడ్మిన్ & అలైడ్ కేడర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) రిక్రూట్‌మెంట్ చేపట్టింది. సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM).. తాజాగా అడ్మిన్ & అలైడ్ కేడర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధన కేంద్రాల్లో స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ఇతర జాబ్ రోల్స్‌లో 1061 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ సమర్పించడానికి గడువు డిసెంబర్ 7తో ముగియనుంది.

ఖాళీల వివరాలు

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 12 పోస్టులు

స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 04 పోస్టులు

సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు

వెహికల్ ఆపరేటర్ ‘ఎ’: 145 పోస్టులు

ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’: 18 పోస్టులు

ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

అర్హత, ఎంపిక ప్రక్రియ

ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం తప్పనిసరి. అభ్యర్థులను మెరిట్(పర్సెంటేజ్/మార్కులు) ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చేరే సమయంలో మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోస్టులకు టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షల) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్

Step 1: ముందుగా డీఆర్‌డీవో అధికారిక వెబ్‌సైట్drdo.gov.in ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో DRDO CEPTAM లింక్‌పై క్లిక్ చేయాలి.

Step 2 : ఇక్కడ కొత్త విండోలో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దాన్ని నింపి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

Step 3 : తర్వాత ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాలకు అప్లికేషన్‌ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోండి.

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయవచ్చు. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Cheapest 5G Smartphone Launch: అతి తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్ .. తాజాగా లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ కంపెనీ

జీతభత్యాలు

అన్ని పోస్టులకు పే స్కేల్ భిన్నంగా ఉంటుంది. పే లెవెల్-6కు 7వ CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం నెలకు రూ. 35,400- రూ.1,12,400 మధ్య ఉంటుంది. 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం పే లెవల్-4కు నెల జీతం రూ. 25,500- రూ.81,100), పే లెవెల్-2కి 7వ CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం నెలకు రూ. 19,900- రూ.63,200 మధ్య ఉంటుంది.

దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. https://ceptam10.com/cepanaoct22/

First published:

Tags: DRDO, Drdo jobs, JOBS

ఉత్తమ కథలు