DRDO Jobs : ఇంటర్ పాసైతే ఉద్యోగాలు... 224 పోస్టులు

DRDO ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు... అధికారిక వెబ్‌సైట్ లేదా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపర్ వీక్లీ ఎడిషన్లను మాత్రమే రిఫర్ చేసుకోవడం ఉత్తమం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 10:41 AM IST
DRDO Jobs : ఇంటర్ పాసైతే ఉద్యోగాలు... 224 పోస్టులు
DRDO Jobs : ఇంటర్ పాసైతే ఉద్యోగాలు... 224 పోస్టులు
Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 10:41 AM IST
DRDO Recruitment 2019 : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ - DRDO... అడ్మినిస్ట్రేషన్, సంబంధిత కేడర్‌లో ఉద్యోగాలు ఇవ్వబోతోంది. మొత్తం 224 ఖాళీలను భర్తీ చెయ్యబోతోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు మినిమం ఇంటర్ పాసై ఉండాలి. లేదా 10+2 పూర్తి చేసి ఉండాలి. ఐతే ఇప్పటివరకూ ఈ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ DRDO-CEPTAMలో అప్‌లోడ్ చెయ్యలేదు. అందువల్ల ఈ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కోసం drdo.gov.in లేదా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్... వీక్లీ ఎడిషన్లను మాత్రమే రిఫర్ చేసుకోవడం మంచిది. DRDO జాబ్స్‌కి సంబంధించి ఎక్కడైనా నోటిఫికేషన్ కనిపిస్తే... అది నిజమైనదా కాదా అన్నది అభ్యర్థులు జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి. డూప్లికేట్ నోటిఫికేషన్లు చాలా వస్తున్నాయి.

గుర్తుంచుకోండి... DRDO తన నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే అడుగుతుంది. అంతకు మించి డబ్బు అడగదు. అప్లై చేసుకోవాలనుకునేవారు... ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లు, ఏవి అడిగినా... అధికారిక ప్రకటనలో అడిగితే ఎలాంటి సమస్యా ఉండదు. డూప్లికేట్ ప్రకటనల్లో చిక్కుకుంటే మాత్రం ప్రమాదమే.

కింది క్రైటీరియా ఉన్నవారు అర్హులు :

- అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 పాసవ్వాలి. 18-27 మధ్య వయస్సు కలిగి ఉంటాలి.



- కంప్యూటర్ ఆధారిత టెస్ట్, ట్రేడ్, స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, సామర్ధ్య టెస్ట్ వంటి వాటితో DRDO... అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది.

అప్లికేషన్‌కి చివరి తేదీ :
అప్లికేషన్ సబ్‌మిట్ చెయ్యాల్సిన చివరి తేదీ అక్టోబర్ 15.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...