రక్షణ రంగంలో రీసెర్చ్ చేయాలనుకునే విద్యార్థుల కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కొత్త కోర్సును ప్రారంభించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో కొత్తగా రెగ్యులర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) కోర్సును ప్రారంభించింది. ఈ మేరకు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి జూలై 8న వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేశారు. డిఫెన్స్ స్టడీస్, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో రీసెర్చ్ చేయాలనుకునే విద్యార్థులకు కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు.
డిఫెన్స్ సెక్టార్లో రీసెర్చ్ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోవాలని ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి కోరారు. కోర్సులో భాగంగా విద్యార్థులకు డిఫెన్స్ సర్వీసెస్‌పై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏఐటీసీఈ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ, ప్రవేటు డీమిడ్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు ఈ కోర్సును నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కోర్సును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అభ్యసించవచ్చు. కోర్సు నిర్వహణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజీస్ (ఐడిఎస్టి) సహకారం అందిస్తుంది.
స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా..
ఇది మొత్తం రెండేళ్ల వ్యవధి గల రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్. ఇందులో కాంబాట్ టెక్నాలజీ, ఏరో టెక్నాలజీ, నావల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్, డైరెక్టెడ్ ఎనర్జీ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్ టెక్నాలజీ ఆనే ఆరు విభాగాల్లో శిక్షణనిస్తారు. కోర్సు మొదటి సంవత్సరంలో థియరిటికల్ క్లాసులు ఉంటాయి. ఇక, ఫైనలియర్లో థీసిస్ కోసం డీఆర్డీఓ ల్యాబరేటరీస్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ (పిఎస్‌యు), డిఫెన్స్ ఇండస్ట్రీల్లో పనిచేసే అవకాశాలు లభిస్తుంది. తద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అలవడుతుంది. ఇటువంటి ప్రత్యేకమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రక్షణ రంగానికి ప్రతిభావంతులైన నిపుణులను అందిస్తుందని డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి అన్నారు. ఈ కోర్సు ద్వారా స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని ఉత్పత్తి చేయడంతో పాటు డిఫెన్స్ స్టార్టప్‌లు, ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయవచ్చని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధే అభిప్రాయపడ్డారు. కాగా, కోర్సు గురించి మరిన్ని వివరాలను ఏఐసీటీఈ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, EDUCATION