news18-telugu
Updated: May 22, 2019, 6:09 PM IST
‘దోస్త్’ నోటిఫికేషన్ గడువుపెంపు
తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో సీట్ల కేటాయింపు జరపనున్నట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థుల ఆన్సర్ షీట్స్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గతంలో ఈ నోటిఫికేషన్ వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ‘దోస్త్’ కమిటీ నోటిఫికేషన్ని ప్రకటించింది. నోటిఫికేషన్లో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన ప్రతీ ముఖ్యమైన తేదీని ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
నోటిఫికేషన్ ముఖ్యతేదీలు..* ఈ నెల 23 నుంచి జూన్ 3 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు
* ఈ నెల 25 నుంచి జూన్ 3 వరకు వెబ్ఆప్షన్లు
* జూన్ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు
* జూన్ 10 నుంచి జూన్ 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు
* జూన్ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు* జూన్ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు
* జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
* జులై 1 నుంచి డిగ్రీ తరగతుల ప్రారంభం
నోటిఫికేషన్లో ప్రతీ అంశాన్ని పొందుపరిచిన అధికారులు.. ముఖ్యమైన తేదీల గురించి కూడా వెల్లడించారు. అప్లై చేయాలనుకునే విద్యార్థులు నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చదవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
IGNOU Entrance 2019 : ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
Govt Jobs : పది పాసైతే చాలు.. బోర్డర్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..
NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..
Published by:
Amala Ravula
First published:
May 22, 2019, 6:09 PM IST