Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

Doordarshan Kendra Vijayawada Recruitment 2020 | విజయవాడలోని దూరదర్శన్ కేంద్రం రీజనల్ న్యూస్ యూనిట్‌లో ఖాళీల భర్తీ జరుగుతోంది. జర్నలిజంతో పాటు వివిధ విభాగాల్లో అనుభవం ఉన్నవారిని తాత్కాలికంగా నియమించబోదోంది దూరదర్శన్ సప్తగిరి.

news18-telugu
Updated: February 25, 2020, 12:01 PM IST
Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు జర్నలిజంలో అనుభవం ఉందా? వీడియో ఎడిటింగ్ తెలుసా? కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ యూనిట్‌లో ఖాళీల భర్తీ జరుగుతోంది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, వీడియో ఎడిటర్, కెమెరామ్యాన్ లాంటి పోస్టులున్నాయి. ఇవి రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ పోస్టులు కావు. ఎంపికైనవారికి నెలకు గరిష్టంగా 7 అసైన్‌మెంట్స్ ఉంటాయి. ప్రతీ అసైన్‌మెంట్‌కు పేమెంట్ ఉంటుంది. అసైన్‌మెంట్ ఉన్నరోజు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు, పారితోషికం వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://doordarshan.gov.in/whats-new  వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Doordarshan Saptagiri Recruitment 2020: భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే...



అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్
ప్రొడ్యూసర్
కాపీ ఎడిటర్
న్యూస్ రిపోర్టర్
అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్వెబ్‌సైట్ అసిస్టెంట్
బ్రాడ్‌క్యాస్ట్ అసిస్టెంట్
పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్
ప్రొడక్షన్ అసిస్టెంట్
వీడియో ఎడిటర్ / వీడియోగ్రాఫర్ / వీడియో అసిస్టెంట్
కెమెరామ్యాన్ / కెమెరా అసిస్టెంట్
స్టెనోగ్రాఫర్
సీజీ ఆపరేటర్
తెలుగు న్యూస్ ప్రజెంటర్

Doordarshan Saptagiri Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 ఫిబ్రవరి 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 13 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు విధానం- దూరదర్శన్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని ఫామ్ పూర్తి చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా దరఖాస్తులు పంపాలి.
ఎంపిక విధానం- దరఖాస్తుల పరిశీలన, స్కిల్ టెస్ట్.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
G.Suresh Kumar, IIS
Dy.Director & Head of RNU
Doordarshan Kendra
Punnamathota
Vijayawada 520 010.

దరఖాస్తు ఫామ్‌తో పాటు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: February 25, 2020, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading