‘కేసీఆర్ సార్... స్కూళ్లకు సెలవులొద్దు...’

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను ఈ నెల 31 వరకు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసంగా లేదని సెస్ అభిప్రాయ పడుతోంది.

news18-telugu
Updated: March 14, 2020, 8:44 PM IST
‘కేసీఆర్ సార్... స్కూళ్లకు సెలవులొద్దు...’
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను ఈ నెల 31 వరకు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసంగా లేదని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్) అభిప్రాయ పడుతోంది. ఓ వైపు భయం లేదంటూనే మరోవైపు ప్రజల్లో భయం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం 17 రోజుల పాటు సెలవులు ప్రకటించడాన్ని సెస్ చైర్మన్ నాగటి నారాయణ తప్పుపట్టారు. ‘కరోనా వైరస్ కి గురై చనిపోయిన వారిలో 45 సంవత్సరాల పైబడిన వయస్కులేనని తెలుస్తోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుండే పిల్లలకు కరోనా సోకిన కేసులు లేవని కూడా తెలుస్తోంది. కరోనా ప్రమాదం నుండి రాష్ట్రం సురక్షితంగా వుందని చెబుతూ మరోవైపు ఇన్నేసి రోజులు విద్యాసంస్థలను బంద్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రం యథాతధంగా నిర్వహించాలంటే ఆ విద్యార్థులకు కరోనా సోకదనే భరోసా వుందా? ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో వుండి ఏమి చేస్తారు? టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం తప్ప. మధ్యాహ్న భోజనం లేకపోతే బాధపడే విద్యార్థులు చాలామంది వున్నారనే విషయాన్ని కూడా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నా’. అని సెస్ చైర్మన్ నాగటి నారాయణ కోరారు.

కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, సినిమా ధియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించింది. అయితే, మార్చి 19 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరగనున్నాయి. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల మీద తెలంగాణ ప్రభుత్వం హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని చర్చించారు.
First published: March 14, 2020, 8:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading