• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DONALD TRUMP NEW YEAR SHOCK TO INDIAN IT FIRMS HSN

Donald Trump: భారతీయులకు న్యూ ఇయర్ షాకిచ్చిన ట్రంప్..!

Donald Trump: భారతీయులకు న్యూ ఇయర్ షాకిచ్చిన ట్రంప్..!

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు న్యూ ఇయర్ షాకిచ్చారు. భారతీయ ఐటీ ఉద్యోగలకు ఇబ్బందికరంగా మారిన ఓ కీలక ఆదేశాల గడువు కాసేపట్లో ముగుస్తుందనగా మరో బాంబు పేల్చారు

  • Share this:
    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు న్యూ ఇయర్ షాకిచ్చారు. భారతీయ ఐటీ ఉద్యోగలకు ఇబ్బందికరంగా మారిన ఓ కీలక ఆదేశాల గడువు కాసేపట్లో ముగుస్తుందనగా మరో బాంబు పేల్చారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాల గడువును మరో మూడు నెలల పాటు పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోకి విదేశీ ఉద్యోగుల రాకపోకలను నిషేధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.. వాస్తవానికి ఈ ఆదేశాల గడువు డిసెంబర్ 31.. అంటే గురువారంతోనే ఈ గడువు ముగిసింది.. కానీ ట్రంప్ వ్యూహాత్మకంగా.. మరికొద్ది గంటల్లో ఈ ఆదేశాల గడువు తీరిపోతుందగా.. ఊహించని షాకిచ్చారు.. అమెరికాలోకి విదేశీ ఉద్యోగుల ఎంట్రీపై నిషేధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.. అంటే మార్చి 30 వరకు అమెరికాలోకి భారత్ సహా విదేశాల పౌరులు ఉద్యోగాల కోసం అడుగుపెట్టలేరన్నమాట.

    వాస్తవానికి ఈ ఆదేశాల గడువు ముగుస్తుందని హెచ్ 1 బీ వీసా అభ్యర్థులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. జనవరిలో ఐటీ ఉద్యోగులను హెచ్ 1 బీ వీసాపై అమెరికాకు పంపించేందుకు భారత్ లోని బడా బడా కంపెనీలు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి.. కానీ ట్రంప్ వీరికి ఊహించని రీతిలో చెక్ పెట్టినట్టయింది.. ట్రంప్ నిర్ణయం. భారతీయ ఐటీ ఉద్యోగలకే కాకుండా కంపెనీలకు కూడా విఘాతంగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అగ్రరాజ్యం చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.. అమెరికాలోనూ నిరుద్యోగం పెరిగిపోయింది. దీంతో అమెరికన్ పౌరుల ఉద్యోగ భద్రత కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. మొత్తానికి ట్రంప్ ఇచ్చిన ఈ ఆదేశాల వల్ల అమెరికాలో ఉద్యోగం చేసేందుకు తహతహలాడుతున్న భారతీయ హెచ్ 1బీ వీసా అభ్యర్థులు మార్చి 30 వరకు ఆగాల్సిందే. అప్పటికి అమెరికాలో ట్రంప్ సర్కారు పోయి.. బైడెన్ అధ్యక్షుడిగా ఉంటారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు