Home /News /jobs /

DON BOSCO UNIVERSITY OFFERS UP TO RS 10 LAKHS SCHOLARSHIPS TO STUDENTS SS GH

Don Bosco Scholarships: విద్యార్థులకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన డాన్​ బాస్కో యూనివర్సిటీ

Don Bosco Scholarships: విద్యార్థులకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన డాన్​ బాస్కో యూనివర్సిటీ
(ప్రతీకాత్మక చిత్రం)

Don Bosco Scholarships: విద్యార్థులకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన డాన్​ బాస్కో యూనివర్సిటీ (ప్రతీకాత్మక చిత్రం)

Don Bosco Scholarships | డాన్ బాస్కో యూనివర్సిటీ (Don Bosco University) విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్స్ అందించనుంది.

ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్​షిప్​లను (Scholarship) అందజేస్తున్నాయి. తాజాగా అస్సాంలోని డాన్ బాస్కో యూనివర్సిటీ (Don Bosco University) ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్​షిప్​లను ప్రకటించింది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ. 4 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపింది.

ఈ స్కాలర్​షిప్​పై అస్సాం డాన్ బాస్కో యూనివర్సిటీ (ADBU) వైస్ ఛాన్సలర్ స్టీఫెన్ మావెలీ మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ గల విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు ఏటా రూ. 4 కోట్ల విలువైన స్కాలర్​షిప్​లను అందజేస్తున్నాం. 2021–22 విద్యా సంవత్సరానికి గాను కోర్సును బట్టి ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ. 4.6 లక్షలు, కనిష్టంగా రూ. 30 వేల స్కాలర్​షిప్​ ఇవ్వాలని నిర్ణయించాం. కేటరిగీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి స్కాలర్​షిప్​ ఆఫర్​ చేస్తున్నాం. అర్హత, ఆర్థిక నేపథ్యం, రిజర్వేషన్ స్థితిని బట్టి విద్యార్థులను స్కాలర్​షిప్​కు ఎంపిక చేస్తాం" అని చెప్పారు.

Job Mela: మొత్తం 1,085 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా... రూ.60,000 వరకు వేతనం

కేవలం విద్యలోనే కాదు కో-కరిక్యులర్ యాక్టివిటీస్​లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మావెలీ అభిప్రాయపడ్డారు. అందుకే స్పోర్ట్స్ కోటా, కల్చరల్​ కోటా కింద అదనంగా రూ. 10.4 లక్షల స్కాలర్‌షిప్‌లను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మొత్తం 45 కోర్సులకు స్కాలర్​షిప్​


ఈ స్కాలర్​షిప్​కు మొత్తం 1,300 నుంచి 1,400 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని వైస్​ ఛాన్స్​లర్​ పేర్కొన్నారు. స్కాలర్​షిప్​తో పాటు ఉచిత ఆన్‌లైన్ కోర్సులకు యాక్సెస్​ కూడా అందిస్తామని తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివిధ స్ట్రీమ్‌లలోని మొత్తం 45 కోర్సులను కవర్ చేస్తుంది. ఇంటర్నల్​ రిజర్వ్, ఇండస్ట్రీ టై-అప్స్​, ప్రభుత్వ సహకారాల ద్వారా ఈ స్కాలర్​షిప్​లకు నిధులు సమకూరుతాయని మావెలీ చెప్పారు.

Railway Jobs 2021: రైల్వేలో 771 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు తెలుసుకోండి

డాన్​బాస్కో యూనివర్సిటీ తమ విద్యార్థుల ప్లేస్​మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వర్సిటీ ప్రస్తుతం 74 శాతం ప్లేస్​మెంట్​ రికార్డును కలిగి ఉంది. 100 శాతం ప్లేస్​మెంట్​ కోసం రూ. 22 కోట్ల పెట్టుబడితో ఇంక్యుబేషన్ సెల్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తున్నామని తెలిపింది. మరో ప్రైవేట్ ఇన్​స్టిట్యూట్ అస్సాం డౌన్ టౌన్ యూనివర్సిటీ (AdtU) దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రూ .1 కోటి వరకు స్కాలర్‌షిప్​ను ప్రకటించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Scholarship, Scholarships

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు