Home /News /jobs /

Learning English: ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? గూగుల్ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ పని సులభం చేసుకోండి..

Learning English: ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? గూగుల్ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ పని సులభం చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ అనుమానం వచ్చినా గూగుల్ తల్లిని ఆశ్రయించే ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకునే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. కేవలం పదాల అర్థాలు తెలుసుకోవడం మాత్రమే కాదు.. అనేక కొత్త కఠిన పదాలను పరిచయం చేయడంతో పాటు వాటి అర్థాలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ద్వారా వినియోగదారులకు అందిస్తోంది.

ఇంకా చదవండి ...
గూగుల్ సెర్చ్ (Google search) ఇంజన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే గూగుల్ తన వినియోదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్‌లు అందిస్తోంది. ఏ అనుమానం వచ్చినా గూగుల్ (google) తల్లిని ఆశ్రయించే ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకునే ఫీచర్‌ (feature) అందుబాటులోకి వచ్చింది. కేవలం పదాల అర్థాలు తెలుసుకోవడం మాత్రమే కాదు.. అనేక కొత్త కఠిన పదాలను పరిచయం చేయడంతో పాటు వాటి అర్థాలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ద్వారా వినియోగదారుల (users)కు అందిస్తోంది. అయితే ఎవరైతే సబ్‌స్క్రైబ్ (Subscribe) చేసుకుంటారో వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్లు (notifications) వస్తాయి. మీరూ ఇంగ్లీష్ నేర్చుకోవానుకున్నా (want to learn English), మరింత లాంగ్వేజ్ స్కిల్స్‌ (language skills)ను మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటున్నా వెంటనే గూగుల్ సెర్చ్ (Google Search)లోకి వెళ్లి సబ్‌స్క్రైబ్ (subscribe) చేసుకోండి.

దీని ఉపయోగాలు ఏంటంటే..
గూగుల్ (google) ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మెరుగుపరచుకోవచ్చు. సబ్‌స్క్రైబర్లు ప్రతి రోజూ నోటిఫికేషన్ల (notifications) ద్వారా అనేక కొత్త ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. కఠినమైన కొత్త పదాలు (new words) నేర్చుకోవడంతో పాటు, వాటి అర్థాలు (meanings) కూడా తెలుసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు (users) కొత్త పదాలకు అర్థం తెలుసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని గూగుల్ (google) తెలిపింది. గూగుల్ ట్రెండ్స్ పరిశీలిస్తే గత నెలలో ఇంటిగ్రిటీ (integrity) పదానికి బదులు ఇంట్రావర్ట్ (Introvert) అనే పదం సెర్చ్‌లో టాప్ లో నిలిచింది. అంటే వినియోగదారులు పదాల అర్థాలను గూగుల్ సెర్ఛ్ ద్వారా తెలుసుకుంటున్నారని అర్థమవుతోంది. ఈ కొత్త ఫీచర్‌  (new feature)ద్వారా అనేక పదాల అర్థాలు తెలుసుకోవడమే కాదు, నేర్చుకోవాలన్న (learning) ఉత్సుకతను పెంచుతోందని ఓ బ్లాగ్ లో గూగుల్ వివరించింది.

మరిచిపోయిన వాటిని గుర్తుచేస్తోంది..

సబ్‌స్క్రైబ్‌ (subscribe) చేసుకున్న వినియోగదారులు నోటిఫికేషన్ల ద్వారా కొత్త పదాల అర్థం తెలుసుకోగలుగుతున్నారు. కఠినమైన పదాలను, వాటి అర్థాలను కూడా నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. సహజంగా వినియోగదారులు కొన్ని పదాలను వాడకపోవడం వల్ల కొన్ని రోజుల తరవాత వాటిని మర్చిపోతూ ఉంటారు. అనేక పదాల అర్థాలు తెలియజేయడం ద్వారా వినియోగదారులు ఆ పదాలను మర్చిపోకుండా గూగుల్ చేస్తోంది.

ఈ ఫీచర్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం ఎలా?

ఈ ఫీచర్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం చాలా తేలిక (easy). గూగుల్ సెర్చ్ లో ఏదైనా ఒక పదాన్ని సెర్చ్ చేసి, కుడివైపు పైన వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇక అంతే అనేక ఇంగ్లీష్ పదాల అర్థాల నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి.

* ప్రస్తుతం ఈ ఫీచర్ ఏఏ భాషల్లో అందుబాటులోకి వచ్చింది

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంగ్లీష్‌కు మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్టు గూగుల్ ప్రకటించింది. ఇంగ్లీష్ నేర్చుకునేవారికి, అలాగే ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడనుకునే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంగ్లీష్ లో కఠినమైన లెవల్స్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: English medium, Google search, Learning

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు