ఇంజనీరింగ్ (Engineering) ప్రవేశ పరీక్షల ఫలితాలు JEE మెయిన్, JEE అడ్వాన్స్డ్ 2021 ఫలితాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ పరీక్షల అనంతరం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institutes of Technology)లో ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (Joint Seat Allocation Authority) కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడవ మెరిట్ జాబితా (Merit List)ను విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చేరేందుకు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల (Engineering College)ను గురించి తెలుసుకొందాం.
భారతదేశంలో టాప్ ఇంజినీరింగ్ కళాశాలల వివరాలు ..
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (National Institutional Ranking Framework) 2021 ఆధారంగా, ఇంజనీరింగ్‌లో చేరేందుకు టాప్-15 కళాశాలలు వివరాలు ఇలా ఉన్నాయి.
ర్యాంక్ | కళాశాల పేరు |
1 | ఐఐటీ, మద్రాస్ |
2 | ఐఐటీ, ఢిల్లీ |
3 | ఐఐటీ,బాంబే |
4 | ఐఐటీ, కాన్పూర్ |
5 | ఐఐటీ, ఖరగ్‌పూర్ |
6 | ఐఐటీ, రూర్కీ |
7 | ఐఐటీ, గౌహతి |
8 | ఐఐటీ, హైదరాబాద్ |
9 | ఎన్ఐటీ తిరుచిరాపల్లి |
10 | ఎన్ఐటీ, సూరత్కల్ |
11 | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) |
12 | VIT వెల్లూర్ |
13 | IIT ఇండోర్ |
14 | IIT BHU |
15 | ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ |
విదేశాల్లోని టాప్ ఇంజినీరింగ్ కళాశాలలు..
భారతదేశం కాకుండా, QS (క్వాక్వారెల్లి సైమండ్స్) ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ (WUR) సబ్జెక్ట్ ఆధారంగా ప్రపంచంలోని ఉత్తమ కళాశాలలను విడుదల చేస్తుంది. 2021లో ఇంజినీరింగ్‌కి సంబంధించి USలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సబ్జెక్ట్ 2021 ప్రకారం QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 15 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు..
ర్యాంక్ | కళాశాల పేరు |
1 | MIT, యునైటెడ్ స్టేట్స్ |
2 | స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యునైటెడ్ స్టేట్స్ |
3 | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, UK |
4 | ETH జూరిచ్ - స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్విట్జర్లాండ్ |
5 | నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సింగపూర్ |
6 | యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, UK |
7 | యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ |
8 | నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ |
9 | నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ |
10 | సింగువా యూనివర్సిటీ, చైనా |
11 | హార్వర్డ్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ |
12 | EPFL స్విట్జర్లాండ్ |
13 | జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, US |
14 | కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) US |
15 | డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, నెదర్లాండ్స్ |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering, Iiit hyderabad, IIT, IIT Bombay, IIT Madras