హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Techie Internships: మీకు టెకీ కావాలనుందా.. ఈ కంపెనీలు అందిస్తున్న ఇంటర్న్ షిప్, స్టైఫండ్ చూస్తే ఎగిరి గంతేస్తారు !

Techie Internships: మీకు టెకీ కావాలనుందా.. ఈ కంపెనీలు అందిస్తున్న ఇంటర్న్ షిప్, స్టైఫండ్ చూస్తే ఎగిరి గంతేస్తారు !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కెరీర్‌(Career)ను ప్రారంభించడానికి, బిల్డప్ చేయడానికి ఇంటర్న్‌షిప్స్(Internship) బాగా ఉపయోగపడతాయి. ఫుల్ టైమ్ ఉద్యోగంతో మీ కెరీర్‌ను ప్రారంభించే ముందు, కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండడం కలిసివస్తుంది. ఇందుకు ఇంటర్న్‌షిప్‌లు వేదికగా నిలుస్తాయి. మీరు టెక్కీ కావాలనుకుంటున్నట్లయితే అందుకు అవసరమైన ఇంటర్న్‌షిప్‌ల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కెరీర్(Career)ను ప్రారంభించడానికి, బిల్డప్ చేయడానికి ఇంటర్న్‌షిప్స్(Internship) బాగా ఉపయోగపడతాయి. ఫుల్ టైమ్ ఉద్యోగం(Job)తో మీ కెరీర్‌ను ప్రారంభించే ముందు, కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండడం కలిసివస్తుంది. ఇందుకు ఇంటర్న్‌షిప్‌లు వేదికగా నిలుస్తాయి. మీరు టెక్కీ కావాలనుకుంటున్నట్లయితే అందుకు అవసరమైన ఇంటర్న్‌షిప్‌ల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.

యాంటినో ల్యాబ్స్- రియాక్ట్ నేటివ్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్

ఇది జాబ్ ఆఫర్‌తో కూడిన ఇంటర్న్‌షిప్. ఆరునెలల పాటు ఉంటుంది. యాంటినో ట్యాబ్స్ కంపెనీ గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడే వరకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా ఆగస్టు 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైఫండ్‌ ఇవ్వనున్నారు.

కోడ్‌జడ్జ్ ఐటీ సొల్యూషన్స్- ప్రోగ్రామింగ్ ఇంటర్న్‌షిప్

ఇది రెండు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. అల్గారిథమ్, డేటా స్ట్రక్చర్‌కు సంబంధించిన ప్రశ్నలను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు పరిష్కారాలు సరైనవి, గుడ్ కోడ్ క్వాలిటీతో ఉండేలా చూసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్‌ వస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 17లోపు ఇంటర్న్‌షాలా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటెలికనెక్ట్ టెక్నాలజీస్ - ఇంటర్న్‌షిప్

ఈ సంస్థ ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైక్రోసాఫ్ట్ పవర్‌ యాప్స్, పవర్ ఆటోమేట్ సహాయంతో లో- కోడ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. అభ్యర్థులకు నెలకు రూ. 6,000,-8,000 మధ్య స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. పూణే, థానేలోని కంపెనీ కార్యాలయాల్లో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. అయితే కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా ఆగస్టు 16లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  Ramayana Quiz: రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు ! ఆరోహిన్ టెక్నాలజీస్ - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటర్న్‌షిప్

జాబ్ ఆఫర్‌తో కూడిన మరో ఇంటర్న్‌షిప్ ఇది. ఎంపికైన అభ్యర్థులు C/C++ ఆధారిత టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్‌ కోడ్‌పై పని చేయనున్నారు. అభ్యర్థులు బెంగళూరులోని ఆఫీస్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కోసం అభ్యర్థులకు నెలకు రూ. 10,000 స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా ద్వారా ఆగస్టు 16లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

కెరీర్ లైన్స్- మెడికల్ కోడింగ్ ఇంటర్న్‌షిప్

ఆన్‌లైన్- ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, ప్రజెంటేషన్‌ను రూపొందించడంతోపాటు మెడికల్ కోడింగ్‌ను అర్థం చేసుకోవడంలో సహాయం చేయడం వంటి బాధ్యతలను ఇంటర్న్‌లు చేపట్టాల్సి ఉంటుంది. కరూర్, మదురై, దిండిగల్, తిరుచిరాపల్లి వంటి ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండు నెలల పాటు జరిగే ఈ ఇంటర్న్ షిప్‌లో అభ్యర్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 8లోపు ఇంటర్న్‌షాలా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, Internship, JOBS, Wipro

ఉత్తమ కథలు