ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం(Independence day). కోట్లాది భారతీయులు జాతీయ పతాకం(national flag) చేతబూని వీధుల్లో తిరుగుతారు. ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు ఇలా చాలా చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే జెండా కోడ్, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలూ పతాకం వినియోగానికి వర్తిస్తాయి. త్రివర్ణ పతాకం ఇష్టం వచ్చిన సైజులో రూపొందిస్తామంటే కుదరదు. భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అది చట్టరీత్యా నేరం. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. అంతేనా ఒకప్పుడు జాతీయ సెలవు దినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి ప్రభుత్వం అనుమతించేది కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే జెండా ఎగరేయడానికి అధికారముండేది. ఈ విషయం ఓ పారిశ్రామిక వేత్త కోర్టు వరకూ తీసుకెళ్లడంతో కేంద్రం స్పందించి నిబంధనల్లో మార్పులు చేసింది. పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయజెండా(National flag)ను ఎగరేయవచ్చని తెలిపింది. అయితే ఏటా ఆగస్టు 15న భారత జాతీయ పతాకాన్ని దేశవ్యాప్తంగా ఎగరేస్తారు. అయితే ఇంతకీ దేశంలో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఎక్కడ ఎగరేస్తారో తెలుసా.. మహారాష్ట్రలో .. అక్కడ ఎంత సైజులో జెండా ఉంటుంది.. అసలు జెండా ఎంత పరిణామం ఉండాలి అనేది తెలుసుకుందాం..
జాతీయ పతాకం పరిమాణంపై కఠిన నిబంధనలు..
1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. 1951లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర (బి.ఐ.ఎస్.) జాతీయ పతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మన దేశంలో అమల్లోకి వచ్చిన మెట్రిక్ మానానికి సరిపోయేటట్లు 1964లో ఒకసారి, 1968 ఆగష్టు 17న మరొక సారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా కచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం. భారత జాతీయ పతాకం, దీర్ఘ చతురస్రాకారంలోసమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగు కలిగిన అశోక చక్రంతో ఉంటుంది.
పతాక కొలతల విషయానికొస్తే.. మి.మీ. లలో..6300 x 4200, 3600 x 2400, 2700 x 1800,
1800 x 1200, 1350 x 900, 900 x 600, 450 x 300, 225 x 150, 150 x 100లుగా నిర్ణయించారు.
6.3 మీటర్ల వెడెల్పు.. 4.2 మీటర్ల పొడవు
ఇక దేశంలోనే అతిపెద్ద పతాకం మహారాష్ట్రలో ఎగురేస్తారు. అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన మంత్రాలయ భవనం మీద ఎగురుతుంది. మంత్రాలయ భవనం అంటే అక్కడి సచివాలయం. 6.3 మీటర్ల వెడెల్పు 4.2 మీటర్ల పొడవుతో ఈ జాతీయ పతాకం ఉండనుంది. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. మంత్రాలయలో జాతీయ పతాకాన్ని ఆయనే ఎగురవేయనున్నారు. ఇక జాతీయ పతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసరమైన ఖాదీ బట్ట ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్, బాగల్కోట్ జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయ పతాకాలను తయారు చేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకే ఒక్క సంస్థ హుబ్లీలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Honor, Independence Day 2021, India, New rules, Republic Day 2021