సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జులై నెలలో 10, 12వ తరగతుల ఫలితాలను వెల్లడించనుంది. పదవ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలను ఈ వారంలో డిక్లేర్ చేయనున్నారని తెలుస్తోంది. 12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలను జులై 31వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు ప్రకటించే రోజు లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ లో లాగిన్ అవుతారు. దీనివల్ల అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక డిజిటల్ రిపోజిటరీ "డిజిలాకర్"ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు డిజిలాకర్‌లో లాగిన్ అవ్వడం ద్వారా మార్క్‌షీట్, పాస్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, స్కిల్స్ సర్టిఫికేట్స్ వంటి ముఖ్యమైన సర్టిఫికెట్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. విద్యార్థులు సీబీఎస్‌ఈ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారానే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
డిజిలాకర్‌లో ఎలా సైన్అప్ చేయాలో.. డిజిలాకర్ అకౌంట్ లో మార్క్‌షీట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో దశలవారీగా వివరంగా తెలుసుకుందాం.
డిజిలాకర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి..?
స్టెప్ 1: https://accounts.digitallocker.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 'సైన్ ఇన్' అనే ఒక పేజీ కనిపిస్తుంది. అదే పేజీలో కింద 'సైన్ అప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: ఆధార్ కార్డు ప్రకారం మీ పేరుని ఎంటర్ చేయండి.
స్టెప్ 3: ఆధార్ కార్డు ప్రకారం మీ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
స్టెప్ 4: మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
స్టెప్ 5: '6' అంకెల సెక్యూరిటీ పిన్ సెట్ చేయండి.
స్టెప్ 6: మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి.
స్టెప్ 7: ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేయండి.
స్టెప్ 8: సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 9: యూజర్ నేమ్ ను సెట్ చేయండి. (సైన్ఇన్ సమయంలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లకు బదులుగా మీరు యూజర్ నేమ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు)
ఈ స్టెప్స్ పూర్తిగా అనుసరిస్తే చాలు.. మీ డిజి లాకర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.
* డిజిలాకర్‌ను ఉపయోగించి సీబీఎస్‌ఈ బోర్డు 2021 పరీక్షా ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?
సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలు తెలుసుకోవడానికి విద్యార్థులు డిజి లాకర్ వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. లేదా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న డిజి లాకర్ అప్లికేషన్ నుంచి మార్క్‌షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం మొట్టమొదటిగా డిజిలాకర్ వెబ్‌సైట్‌లోని ‘ఎడ్యుకేషన్’ సెక్షన్ కింద ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ పై క్లిక్ చేయాలి.
అనంతరం.. క్లాస్ 10 పాసింగ్ సర్టిఫికేట్.. క్లాస్ 12 పాసింగ్ సర్టిఫికేట్.. క్లాస్ 10 మార్క్‌షీట్ లేదా క్లాస్ 12 మార్క్‌షీట్ లలో మీకు కావలసిన ఆప్షన్ ని ఎంచుకోండి.
ఆ తర్వాత సీబీఎస్‌ఈ బోర్డుతో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి. తర్వాత మీ మార్క్‌షీట్ సర్టిఫికెట్ ని యాక్సెస్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021