Andhra pradesh Jobs : ప్ర‌కాశం జిల్లా డీఎంహెచ్ఓలో కాంట్రాక్టు ఉద్యోగాలు..

ప్ర‌కాశం జిల్లా ఉద్యోగాలు

ప్ర‌కాశం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 62 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ద‌ర‌ఖాస్తుకు కొద్ది రోజుల మాత్ర‌మే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ 30, 2021 సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ ద‌ర‌ఖాస్తును అందించాల్సి ఉంటుంది.

  • Share this:
    ప్ర‌కాశం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 62 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్టాఫ్ న‌ర్సులు (Staff Nurse), డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, ల్యాబ్ టెక్నిషియ‌న్లు (Lab Technicians), లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్   https://prakasam.ap.gov.in/notice_category/recruitment/   ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు కొద్ది రోజుల మాత్ర‌మే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ 30, 2021 సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ ద‌ర‌ఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన స‌మాచారం కోసం చ‌ద‌వండి.

































    పోస్టు పేరు అర్హ‌త‌లు ఖాళీలు జీతం
    స్టాఫ్ న‌ర్సులు గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ మ‌రియు జీఎన్ఎం/ బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. 48 రూ.22,500/-
    డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. మూడు నెల‌లు కంప్యూట‌ర్ కోర్సు చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి. 02 రూ.15,000/-
    ల్యాబ్ టెక్నిషియ‌న్లు గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ అండ్ డీఎల్‌టీ/ బీఎస్సీ, ఎంఎల్‌టీ కోర్సు చేసి ఉండాలి. ఇంట‌ర్ (Inter) వొకేష‌న‌ల్ ఎంఎల్‌టీతో ఒక సంవ‌త్స‌రం అప్రెంటీస్‌షిప్ చేసి ఉండాలి. 05 రూ.19,019/-
    లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టు ప‌దోత‌ర‌గ‌తి లేదా అంత‌కు స‌మాన‌మైన కోర్సు చ‌దివి ఉండాలి 07 రూ.12,000/-

    SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

    ఎంపిక విధానం..
    - మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.
    - రిజ‌ర్వేష‌న్ విధానం పాటిస్తారు.

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
    Step 1:  అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
    Step 2:  ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.
    Step 3:  ద‌ర‌ఖాస్తు ఫాం కోసం అనంత‌రం నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    Step 4:  అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.
    Step 5:  అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌
    - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు
    Step 6:  ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి
    డీఎంహెచ్ఓ, ప్ర‌కాశం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాకు పంపాలి.
    Published by:Sharath Chandra
    First published: