DMHO GUNTUR RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON FOR 324 VACANCIES KNOW HOW TO APPLY SS
Jobs in Guntur: గుంటూరు జిల్లాలో 324 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
Jobs in Guntur: గుంటూరు జిల్లాలో 324 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
DMHO Guntur Recruitment 2021 | గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో సేవలు అందించేందుకు 324 పోస్టుల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 324 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌కు చెందిన డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లో ఈ ఖాళీలున్నాయి. జిల్లాలోని వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈఓ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫామ్ పోస్టులో పంపాలి. అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ నోటిఫికేషన్లో ఉంటుంది.
Step 1- అభ్యర్థులు https://guntur.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Step 2- హోమ్ పేజీలో జాబ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. Step 3-Application Form పైన క్లిక్ చేసే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. Step 5- అప్లికేషన్ ఫామ్స్‌ని నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా స్పీడ్ పోస్టులో పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: DM&HO, Guntur.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.