హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: అనంత‌పురం మెడిక‌ల్ కాలేజీల్లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

Andhra Pradesh Jobs: అనంత‌పురం మెడిక‌ల్ కాలేజీల్లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

అనంత‌పురం జిల్లాలో ఉద్యోగాలు

అనంత‌పురం జిల్లాలో ఉద్యోగాలు

ఆంధ్ర ప్ర‌దేశ్ డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (Directorate of Medical Education) నుంచి అనంత‌పురం జిల్లా ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడ‌ద‌ల అయ్యింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సెప్టెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర ప్ర‌దేశ్ డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (Directorate of Medical Education) నుంచి అనంత‌పురం జిల్లా ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ (Medical College) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడ‌ద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, రేడియాల‌జీ, డెర్మ‌టాల‌జీ త‌దితర విభాగాల్లో పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 11 విభాగాల్లో పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల‌కు ఆఫ్‌లైన్ (Off line) ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు ఫాం త‌దిత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://ananthapuramu.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 21 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చ‌ద‌వండి.

  ముఖ్య‌మైన స‌మాచారం

  మొత్తం పోస్టులు21
  ద‌ర‌ఖాస్తు ప్రారంభంసెప్టెంబ‌ర్ 24, 2021
  అర్హ‌త‌లుసంబంధిత విభాగంలో మెడిక‌ల్ పీజీ చేసి ఉండాలి. లోక‌ల్ అభ్య‌ర్థుల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఉంటుంది. వేరే ప్రాంత అభ్య‌ర్థుల‌కు సెకండ్ ప్రియారిటీ ఇస్తార‌ని పేర్కొన్నారు.
  అధికారిక‌ వెబ్‌సైట్https://ananthapuramu.ap.gov.in/


  ఎంపిక విధానం.

  - పీజీలో థియ‌రీ ప‌రీక్షలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థి షార్ట్ లిస్ట్ (Short list) చేస్తారు.

  - అభ్య‌ర్థుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

  SSC Recruitment 2021: ఎస్ఎస్‌సీలో ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1:  ముందుగా అభ్య‌ర్థి అధికారిక వెబ్‌సైట్‌కి https://ananthapuramu.ap.gov.in/ వెళ్లాలి.

  Step 2: అనంత‌రం NOTICES విభాగంలో Recruitment లోకి వెళ్లాలి.

  Step 3: అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4: నోటిఫికేష‌న్‌లో అర్హ‌త క‌లిగిన పోస్టుకు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Step 5: అనంత‌రం వెబ్‌సైట్ నుంచి అప్లికేష‌న్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. (అప్లికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 6: ద‌ర‌ఖాస్తు ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

  Step 7: అవ‌స‌ర‌మైన అకాడింక్ ధ్రువ‌ప‌త్రాల‌ను, అప్లికేష‌న్ ఫాంతో జ‌త చేయాలి.

  Step 8: పూర్తి ద‌ర‌ఖాస్తు ఫాంను ప్రిన్సిపాల్, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, అనంత‌పురం అడ్ర‌స్‌కు పంపాలి.

  Step 9: ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 29, 2021

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Anantapuram, CAREER, Govt Jobs 2021, Health department jobs, Job notification, Medical college

  ఉత్తమ కథలు