హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం
(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం (ప్రతీకాత్మక చిత్రం)

DLRL DRDO Recruitment 2020 | హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DLRL కోసం పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఇవి రెండేళ్ల కాలానికి భర్తీ చేస్తున్న పోస్టులు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించే అవకాశముంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది డీఆర్‌డీఓ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లో అప్లై చేయాలి. అంటే అభ్యర్థులు 2020 సెప్టెంబర్ 12 లోగా దరఖస్తు చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పోస్టులో పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SSC Constable Jobs: ఇంటర్ పాసయ్యారా? 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి

ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్

DLRL DRDO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 10

జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఈసీఈ)- 7

జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎంఈ)- 3

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 12

వేతనం- రూ.31,000

విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా గేట్ పరీక్ష పాస్ కావాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ (ఎంఈ లేదా ఎంటెక్) ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి.

వయస్సు- 28 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్:

The Director,

Defense Electronics Research Laboratory (DLRL),

Ministry of Defence,

DRDO Chandrayangutta Lines,

Hyderabad- 500005,

Telangana.

First published:

Tags: CAREER, DRDO, Exams, Hyderabad, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు