హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC FBO Posts: త్వరలో 1393 FBO పోస్టులకు నోటిఫికేషన్.. 33 జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..

TSPSC FBO Posts: త్వరలో 1393 FBO పోస్టులకు నోటిఫికేషన్.. 33 జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..

TSPSC FBO Posts: త్వరలో 1393 FBO పోస్టులకు నోటిఫికేషన్..  33 జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..

TSPSC FBO Posts: త్వరలో 1393 FBO పోస్టులకు నోటిఫికేషన్.. 33 జిల్లాల వారీగా పోస్టుల వివరాలిలా..

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని పోస్టులను త్వరలో విడుదల చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని పోస్టులను త్వరలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలసిందే. ఈ పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేశారు. తుది కీని నేడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.  వరుస నోటిఫికేషన్ల(Notifications) నేపథ్యంలో నిరుద్యోగులు ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3కు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. వీటికి ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న 1665 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతన్నాయి. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇటీవల ఆర్ఎం డోబ్రియాల్ తెలిపిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్(FBO), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(FRO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ (FSO) వంటి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నేడో , రేపో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటిలో అత్యధికంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా పోస్టులు ఖాళీలు ఇలా ఉన్నాయి.

1. ఆదిలాబాద్ - 57

2. కొత్తగూడెం -భద్రాద్రి - 114

3. హనుమకొండ - 8

4. హైదరాబాద్ - 6

5. జగిత్యాల - 36

6. జనగాం - 4

7. జయశంకర్ భూపాలపల్లి - 103

8. జోగులాంబ గద్వాల్ - 03

9. కామారెడ్డి - 61

10. రీంనగర్ - 08

11. ఖమ్మం - 27

12. ఆసిఫాబాద్ కొమరంభీం - 121

13. మహబూబాబాద్ - 45

14. మహబూబ్ నగర్ - 27

15. మంచిర్యాల - 91

16. మెదక్ - 54

17. మేడ్చల్ మల్కాజిగిరి - 17

18. ములుగు - 99

19. నాగర్ కర్నూల్ - 142

20. నల్గొండ - 33

21. నారాయణపేట -06

22. నిర్మల్ - 83

23. నిజామాబాద్ - 52

24. పెద్దపల్లి - 19

25. రాజన్న సిరిసిల్ల - 19

26. రంగారెడ్డి - 24

27. సంగారెడ్డి - 25

28. సిద్దిపేట - 28

29. సూర్యాపేట - 08

30. వికారాబాద్ - 43

31. వనపర్తి - 13

32. వరంగల్ - 10

33. యాదాద్రి భువనగిరి - 09

మొత్తం - 1393

TSPSC Six Notifications: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నవంబర్ 20 తర్వాత 6 నోటిఫికేషన్లు..

తెలంగాణ టీఎస్పీఎస్సీ నుంచి విడుదల అయ్యే ఈ పోస్టులకు అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

First published:

Tags: Forest, Forest jobs, JOBS

ఉత్తమ కథలు