పదో తరగతి పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. జాల్లా కోర్టుల్లో ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటే.. క్లర్క్(Clerk), స్టెనోగ్రాఫర్(Stenographer), కోర్ట్ రీడర్ కమ్ డిపొసిషన్ రైటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒక్కో విభాగానికి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లింక్ https://dcprequirement.in/ ఆధారంగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
పై పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ సెప్టెబర్ 20, 2022న ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 20, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు ఇలా..
1. క్లర్క్ ఉద్యోగాలు మొత్తం 3325 ఖాళీగా ఉన్నాయి. వీరిని రెండు సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటారు. జీతం నెలకు రూ.25,500 నుంచి రూ. 81,100 చెల్లిస్తారు.
అర్హతలు..
-అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
-బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి.
-మెడికల్ గా ఫిట్ ఉండాలి.
-ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. వీటిలో ప్రతిభ కనిబరిచిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
2. స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలు
స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలు మొత్తం 1562 ఖాళీగా ఉన్నాయి. వీరిని రెండు సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటారు. జీతం నెలకు రూ.25,500 నుంచి రూ. 81,100 చెల్లిస్తారు.
అర్హతలు..
-అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
-బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-స్టెనోగ్రాఫర్ లో సర్టిఫికెట్ పొంది ఉండాలి.
-కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి.
-మెడికల్ గా ఫిట్ ఉండాలి.
ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ, స్టెనో ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
3. కోర్ట్ రీడర్ కమ్ డిపొజిషన్ రైటర్
కోర్ట్ రీడర్ కమ్ డిపొజిషన్ రైటర్ ఉద్యోగాలు మొత్తం 1132 ఖాళీగా ఉన్నాయి. వీరిని రెండు సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటారు. జీతం నెలకు రూ.25,500 నుంచి రూ. 81,100 చెల్లిస్తారు.
అర్హతలు..
-అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
-బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-ఇంగ్లీష్ అండ్ హిందీలో టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
-కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి.
-మెడికల్ గా ఫిట్ ఉండాలి.
ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
4. ప్యూన్ లేదా ఆర్డర్లీ
ప్యూన్ లేదా ఆర్డర్లీ ఉద్యోగాలు మొత్తం 1673 ఖాళీగా ఉన్నాయి. వీరిని రెండు సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటారు. జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 చెల్లిస్తారు.
అర్హతలు..
-అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
-10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
-మెడికల్ గా ఫిట్ ఉండాలి.
ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించవవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Court jobs, JOBS, Patna