తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మేడ్చల్ మల్కాజ్ గిరిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషన్ కేర్, నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్), లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, ఔట్ రీచ్ వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://wdcw.tg.nic.in ను సందర్శించి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ ఫారమ్ మరియు పూర్తి నోటిఫికేషన్ డిసెంబర్ 06, 2022 నుంచి అందుబాటులో ఉండనుంది. దానిలో పేర్కొన్న విధంగా వివరాలను నింపి.. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ తో పాటు.. అవసరమైన డాక్యుమెంట్లను డిసెంబర్ 19, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్, అంతాయిపల్లి గ్రామం, శామీర్‌పేట్ మండలం, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, తెలంగాణ 500078 అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
1. ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషన్ కేర్)- 1
నెలకు జీతం.. రూ.27,300
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషన్ కేర్)- 1
నెలకు జీతం.. రూ.27,300
3. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ - 1
నెలకు జీతం.. రూ.27,300 చెల్లిస్తారు.
4. సోషల్ వర్కర్- 1.
నెలకు జీతం. రూ.18,200 చెల్లిస్తారు.
5. ఔట్ రీచ్ పర్కర్ - 5
నెలకు జీతం.. రూ. 10,400 చెల్లిస్తారు.
6. ఎస్ఎ సోషల్ వర్కర్ : 2.
నెలకు జీతం.. రూ.18,200 చెల్లిస్తారు.
విద్యార్హత..
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. అతే కాకుండా.. సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు లా డిగ్రీ, ఎమ్మెస్సీ సైకాలజీ, రూరల్ డెవప్ మెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూరించిన దరఖాస్తు ఫారంతోపాటు ఎస్ఎస్సి మెమో, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, అంగవైకల్య ధ్రువీకరణ పత్రం (10% కన్నా మించని) అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను పైన తెలిపిన చిరునామాకు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆలస్యంగా అందిన దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు.
షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు మాత్రమే ఈ నియామకానికి సంబంధించి తదుపరి ప్రక్రియను తెలియజేయబడునని తెలిపారు.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
వెబ్సైట్ నందు దరఖాస్తు ఫారాల లభ్యత డిసెంబర్ 06, 2022 నుంచి అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది.. డిసెంబర్ 19, 2022 సాయంత్రం 5 గంటల వరకు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Jobs in telangana, Telangana Government, Telangana government jobs