హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Signareni Exam Results: ‘మా తప్పు ఏం లేదు.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇలా చేశాం’..

Signareni Exam Results: ‘మా తప్పు ఏం లేదు.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇలా చేశాం’..

Signareni Exam Results: ‘మా తప్పు ఏం లేదు.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇలా చేశాం’..

Signareni Exam Results: ‘మా తప్పు ఏం లేదు.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇలా చేశాం’..

Signareni Exam Results: అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎంటర్ చేసిన పేర్లతోనే హాల్ టికెట్ల జారీ చేశాం.. మెరిట్ జాబితాలోనూ అవే పేర్లు వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలపై మీడియా కథనాలపై డైరెక్టర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సింగరేణి లో 177 జూనియర్ అసిస్టెంట్(Singareni Junior Assistant) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా రావడంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై డైరెక్టర్(పర్సనల్) శ్రీ ఎస్.చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కేవలం ఆన్ లైన్ లోనే(Online) ప్రక్రియ ద్వారానే అప్లికేషన్లను స్వీకరించడం జరిగిందని, అభ్యర్థుల నుంచి హార్డు కాపీలను పంపించమని కోరలేదన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారి వివరాలను ఆన్ లైన్ లోనే సరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా స్వీకరించిన అప్లికేషన్ల ప్రకారం హాల్ టికెట్లను(Hall Tickets) ఆల్ లైన్ ద్వారానే జారీ చేయడమైందన్నారు.

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

రాత పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయగా.. అందులో అభ్యర్థుల పేరుకు బదులు రాష్ట్రం పేరు, క్వాలిఫికేషన్ వివరాలు రావడంపై సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై జేఎన్‌టీయూ అధికారుల‌తో మాట్లాడి పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు అభ్యర్థులు వివరాలను సేకరించగా.. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలోనే వారు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , డిగ్రీ, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేయడం చేశార‌ని వెల్ల‌డించారు . ఆన్ లైన్‌ ప్రకియలోనే హాల్ టికెట్లను జారీ చేయడం, మూల్యంకనం కూడా కంప్యూటర్ ఆధారంగానే ఉండటం, ఫలితాలు కూడా కంప్యూటర్ జనరేటెడ్ షీట్లే కావడం వల్ల ఆ నలుగురు అభ్యర్థులు ఎంటర్ చేసిన పేర్లతోనే మెరిట్ జాబితా ముద్రితమైందని తెలిపారు.

పేర్లను తప్పుగా నమోదు చేసిన అభ్యర్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వారి ఫోటో, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వివరాలు, వారి సంతకాన్ని పోల్చి చూసి ప‌రీక్ష నిర్వాహ‌కులు వారిని పరీక్ష కు అనుమతించడం జరిగిందన్నారు. మెరిట్ జాబితాలో పేర్లు తప్పుగా రావడానికి అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు నింపే సమయంలో చేసిన తప్పిదమే కారణమన్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు.

పేర్లు తప్పుగా ఎంటర్ చేసిన ఆ నలుగురు అభ్యర్థుల వివరాలు..

1.హాల్ టికెట్ నెం. 3308978 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు బి. శ్రీను, S/o బానొత్ వీరన్న స్ధానంలో Board of Secondary Education, ST కేటగిరి, ర్యాంక్ 34735 అని అభ్యర్ధి సెంటర్: శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, (సెంటర్-a) యాంనంపేట్, ఘట్కెసర్, హైదరాబాద్ , అభ్యర్ధి అడ్రెస్: సి-62, ఒరిపక్క తండా, గుండెపూడి, మరిపెడ, మహబూబాబాద్ - 506315 సెల్: 9705370017

Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

2.హాల్ టికెట్ నెం. 2204302 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు ఏ. మణికంఠ, S/o అర్రికట్ల వెంకటేశ్వర్లు స్ధానంలో Andhra Pradesh SC కేటగిరి, ర్యాంక్ 31187 అని అభ్యర్ధి సెంటర్: మల్లా రెడ్డి కాలేజీ, గండిమైసమ్మ, ధూలపల్లి, హైదరాబాద్, అభ్యర్ధి అడ్రెస్: 10-5-338/8/6, తుకారాం గేట్, నార్త్ లాలాగూడ, మారేడుపల్లి, సికింద్రాబాద్- 500017 సెల్: 9393101095

3.హాల్ టికెట్ నెం. 2218581 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు బి. లలిత, S/o బోడ బాబు స్ధానంలో Degree ST కేటగిరి, ర్యాంక్ 34172 అని అభ్యర్ధి సెంటర్: ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సెంటర్ -a) లక్ష్మణ్ రెడ్డి అవెన్యూ, గండిమైసమ్మ, ధుండిగల్, హైదరాబాద్, అభ్యర్ధి అడ్రెస్: 5-142, చంద్రా తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం - 507183 సెల్: 9908683160

Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెడ్ కానిస్టేబుల్(HC), ASI పోస్టులకు నోటిఫికేషన్..

4.హాల్ టికెట్ నెం. 7709069 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు వి. శ్రీధర్, S/o వడ్లకొండ సత్తయ్య స్ధానంలో Telengana BCB కేటగిరి, ర్యాంక్ 4026 అని అభ్యర్ధి సెంటర్: వాగ్దేవి డిగ్రీ కాలేజీ, ఐబి చౌరస్తా, మంచిర్యాల , అభ్యర్ధి అడ్రెస్: 8-4-19, S/o వి. సత్తయ్య, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి- 505209 సెల్: 8465946373 ర్యాంక్ మరియు కేటగిరి యధావిధిగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni Collieries Company

ఉత్తమ కథలు