AP Govt Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే(జులై 27న) ప్రారంభం అయ్యింది. కాగా, దరఖాస్తుకు ఈ ఆగస్టు 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంతం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    BEL Recruitment 2021: మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే
    Andhra Pradesh: ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 32 ఖాళీలను, లేటరల్ ఎంట్రీ ద్వారా 17 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రేడియో డయాగ్నసిస్/రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆయా విభాగాల్లో MD / MS/ MDS / DM / M.Ch / DNB విద్యార్హత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు జులై 27 నాటికి 42 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లోస్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు.
    Online Application - Direct Link
    Official Website - Direct Link

    మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో రూ.500 రాయితీ ఇచ్చారు. వారు రూ. 1000 చెల్లిస్తే సరిపోతుంది. అప్లై చేసే సమయంలో నోటిఫికేషన్లో సూచించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: