హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

KVS Recruitment 2022: కేవీఎస్ నుంచి 6,990 పోస్టులకు నోటిఫికేషన్.. PGT, TGTతో పాటు ఇతర పోస్టులు..

KVS Recruitment 2022: కేవీఎస్ నుంచి 6,990 పోస్టులకు నోటిఫికేషన్.. PGT, TGTతో పాటు ఇతర పోస్టులు..

KVS Recruitment 2022: కేవీఎస్ నుంచి 6,990 పోస్టులకు నోటిఫికేషన్.. PGT, TGT ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..

KVS Recruitment 2022: కేవీఎస్ నుంచి 6,990 పోస్టులకు నోటిఫికేషన్.. PGT, TGT ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,990 TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,990 TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం అయి.. డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది.

మొత్తం పోస్టుల సంఖ్య.. 6990

1. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52

అర్హతలు: B.Ed మరియు సంబంధిత ఫీల్డ్ అనుభవంతో PG డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: 78,800-2,09,200

2. ప్రిన్సిపల్ పోస్టులు 239

అర్హతలు: 45 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ అండ్ 15 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: 56100-177500

3. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 203

అర్హతలు: 45% మార్కులతో మాస్టర్ డిగ్రీ & 05 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు - 1409

అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్‌లో 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ & B.Ed పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు - 3176

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ & CTET పరీక్ష ఉత్తీర్ణత మరియు B.Ed పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

New Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 957 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ..

6. లైబ్రేరియన్ పోస్టులు - 355

అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా లైబ్రరీ సైన్స్‌లో 1 సంవత్సరం డిప్లొమా డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) - 303

అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ & సంగీతంలో డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - 06

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Com / M.Com / CA / MBA డిగ్రీ ఉండాలి.

9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు - 02

అర్హతలు: సివిల్ ఇంజనీర్‌లో బిఇ / బి.టెక్ / డిప్లొమా చేసి ఉండాలి.

10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - 156

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

11. హిందీ ట్రాన్స్ లేటర్ - 11

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హిందీ/ఇంగ్లీషులో పీజీ డిగ్రీ ఉండాలి.

12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 322

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 702

అర్హతలు: టైపింగ్‌తో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి. వీటితో పాటు.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు - 54

అర్హతలు: స్టెనోలో డిగ్రీతో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి.

సబ్జెక్ట్ వారీగా టీజీటీ(TGT) ఖాళీలు..

సబ్జెక్ట్ఖాళీలు
హిందీ377
ఆంగ్లం401
సంస్కృతం245
సోషల్ స్టడీస్398
గణితం426
సైన్స్304
P & HE435
ఆర్ట్ ఎడ్యుకేషన్251
WE339

సబ్జెక్ట్ వారీగా పీజీటీ(PGT) ఖాళీలు..

సబ్జెక్ట్ఖాళీలు
హిందీ172
ఆంగ్లం158
భౌతిక శాస్త్రం135
రసాయన శాస్త్రం167
గణితం184
జీవశాస్త్రం151
హిస్టరీ63
భౌగోళిక శాస్త్రం70
ఆర్థిక శాస్త్రం97
కామర్స్66
కంప్యూటర్ సైన్స్142
బయో-టెక్04

దరఖాస్తు ఫీజు..

అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు జనరల్ / OBC : రూ.2,300

TGT/PGT/PRT పోస్టుల కోసం : Gen / OBC : రూ.1,500

SC / ST / PH : ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించొచ్చు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం : 05-12-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 26-12-2022

First published:

Tags: JOBS, Kvs, Teacher jobs

ఉత్తమ కథలు