రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్- మైసూర్(RIEM), కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉపాధ్యాయ పోస్టులను వాక్ -ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు (మే 25) ప్రారంభం కాగా, మే 28 వరకు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ భాషలకు సంబంధించి మొత్తం 25 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీటీ పోస్టుల ఇంటర్వ్యూ(Interview) సమయం మే 25న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేటాయించారు. టీజీటీ పోస్ట్‌కు(TGT Post) సంబంధించి మే 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. మే 27న డబ్ల్యూఈటీ డ్యాన్స్ టీచర్ పోస్టు(Teacher Post) ఇంటర్వ్యూ, మే 28న ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, ఒకేషనల్ టీచర్లు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు వివిధ పోస్టులకు షెడ్యూల్‌లో పేర్కొన్న సమయం, తేదీ ప్రకారం ఇంటర్వ్యూకు హాజరు కావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయానికి కంటే గంట ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
RIEM రిక్రూట్‌మెంట్- 2022: ఖాళీలు
మొత్తం 25 పోస్టుల్లో... 4 గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు (పీజీటీ), 7 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), 6 వర్క్ ఎక్స్‌పీరియన్స్ టీచర్ (డబ్ల్యూఈటీ), 2 ప్రైమరీ టీచర్, 3 ప్రీ-ప్రైమరీ (నర్సరీ, ఎల్‌కెజి & యుకెజీ), 2 ఒకేషనల్ టీచర్ పోస్టులు, 1 సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనునన్నారు.
అర్హత ప్రమాణాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రైమరీ టీచర్ అండ్ ప్రీ-ప్రైమరీ (నర్సరీ, ఎల్‌కెజీ & యుకెజీ) పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. ఒకేషనల్ టీచర్ , సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి వరుసగా 37 , 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
మొదట సంస్థ అధికారిక వెబ్‌సైట్ riemysore.ac.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవాలి. అవసరమైన వివరాలతో అప్లికేషన్‌ను పూరించి, అప్లికేషన్‌లో పేర్కొన్న చోట ఇటీవల పాస్‌పోర్ట్ ఫొటోను అతికించాలి. అప్లికేషన్ ఫారమ్‌పై సంతకం చేసి, ఓ కాపీని అభ్యర్థి తన దగ్గర ఉంచుకోవాలి. షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు అప్లికేషన్‌ను కచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,000 నుంచి రూ.27,500 వరకు వేతనం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Karnataka, Mysore, Teacher jobs, Walk in interview