• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DIGITAL MARKETING TO FREELANCING THESE 11 IDEAS CAN GENERATE EXTRA INCOME TO YOU SS

Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి

Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి

Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి (ప్రతీకాత్మక చిత్రం)

Extra Income | మీకు వచ్చే జీతంతో పాటు రెండో ఆదాయం కోసం ఆలోచిస్తున్నారా? అయితే ఈ 11 మార్గాల ద్వారా అదనంగా ఆదాయం పొందొచ్చు.

  • Share this:
    మీ జీతం ఖర్చులకు కూడా సరిపోవట్లేదా? అదనంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? పొదుపు చేయడానికి లేదా మీకు నచ్చిన వాటి కోసం ఖర్చు చేయడానికి కాస్త ఎక్కువ ఆదాయం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఉద్యోగం చేస్తుండగా వచ్చే జీతం మాత్రమే కాదు, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో కాస్త కష్టపడితే అదనంగా ఆదాయం మీ సొంతం. కరోనా వైరస్ సంక్షోభం తర్వాత రెండో ఆదాయంపై ఎక్కువ మంది దృష్టిపెట్టారు. ఒక ఆదాయాన్ని ఖర్చుల కోసం, ఇంకో ఆదాయాన్ని పొదుపు కోసం ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు కూడా అదనంగా ఆదాయం పొందాలనుకుంటే ఈ 11 మార్గాలు ట్రై చేయొచ్చు.

    Stock Market: కరోనా సంక్షోభ కాలంలో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. అంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ద్వారా అదనంగా ఆదాయం పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు అందుకు సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవడం అవసరం. ఆ తర్వాత ఆచితూచి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి.

    Work From Home Jobs: ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి ఇలా

    Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే

    how to generate extra income, how to earn extra income in india, extra income ideas from home, how to make extra income while working full-time, extra income online, second income opportunities, real ways to make money from home, ఆన్‌లైన్ బిజినెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్స్, ఆన్‌లైన్ జాబ్స్
    ప్రతీకాత్మక చిత్రం


    Freelancer: మీకు ఏదైనా స్కిల్ ఉందా? అయితే ఫ్రీలాన్సర్‌గా పనిచేయొచ్చు. చాలా కంపెనీలు ఫ్రీలాన్సర్‌లకు వర్క్స్ ఇస్తున్నాయి. మీకు నచ్చిన సమయంలో మీకు నచ్చినంత సేపు పనిచేయొచ్చు. పనికి తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది.

    Blogging: మీకు ఏదైనా సబ్జెక్ట్‌పై మంచి పట్టు ఉందా? అయితే మీరు బ్లాగర్ కావొచ్చు. మీకు తెలిసిన టాపిక్స్‌పై బ్లాగ్స్ రాస్తూ సంపాదించొచ్చు. ఆ సబ్జెక్ట్‌పై లోతైన అవగాహనతో పాటు ఆకట్టుకునేలా బ్లాగ్ రాయడం తెలిసి ఉండాలి.

    YouTube: మీకు వ్లాగింగ్ అంటే ఇష్టమా? మీకు ఏదైనా టాలెంట్ ఉందా? అయితే ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మీ వీడియోలను పోస్ట్ చేయండి. ఆ తర్వాత యాడ్‌సెన్స్‌కు అప్లై చేయండి. మీ యూట్యూబ్ ఛానెల్ పాపులర్ అయ్యేకొద్దీ ఆదాయం పెరుగుతుంది.

    Work From Home Jobs: మీకు ఈ 6 స్కిల్స్ ఉన్నాయా? ఇంటి నుంచే జాబ్ చేయొచ్చు

    Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

    how to generate extra income, how to earn extra income in india, extra income ideas from home, how to make extra income while working full-time, extra income online, second income opportunities, real ways to make money from home, ఆన్‌లైన్ బిజినెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్స్, ఆన్‌లైన్ జాబ్స్
    ప్రతీకాత్మక చిత్రం


    Affiliate marketing: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మే ప్రొడక్ట్స్‌కి మీరు అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు. అఫిలియేటెడ్ మార్కెటింగ్‌పై అనేక కోర్సులు ఉన్నాయి.

    Refer and earn: ఇ-కామర్స్ సంస్థలు రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటాయి. మీ స్నేహితులు, బంధువులకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని మీరు రిఫర్ చేసి, వాటిని కొనేలా చేస్తే మీకు ఆదాయం వస్తుంది.

    Online course: మీకు పట్టు ఉన్న సబ్జెక్ట్‌పై ఓ ఆన్‌లైన్ కోర్సు రూపొందించి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేస్తే చాలు. ఆ కోర్సును యాక్సెస్ చేయడానికి ఎంతో కొంత ఫీజు నిర్ణయించాలి. ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగింది కాబట్టి మీ కోర్సుకు కూడా రెస్పాన్స్ ఉంటుంది. అయితే ఆ సబ్జెక్ట్‌ని చక్కగా టీచ్ చేయగల నైపుణ్యం మీకుండాలి.

    Tutoring: ఆన్‌లైన్‌లో కోర్సు రూపొందించడం మాత్రమే కాదు ట్యూటరింగ్ కూడా మంచి ఆప్షనే. మీకు తెలిసిన సబ్జెక్ట్స్‌పై ట్యూషన్స్ చెప్పండి. మీకు ఆ సబ్జెక్ట్‌పై గ్రిప్ అలాగే ఉంటుంది. మీకు డబ్బులు కూడా వస్తాయి.

    Future Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్

    Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?

    how to generate extra income, how to earn extra income in india, extra income ideas from home, how to make extra income while working full-time, extra income online, second income opportunities, real ways to make money from home, ఆన్‌లైన్ బిజినెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్స్, ఆన్‌లైన్ జాబ్స్
    ప్రతీకాత్మక చిత్రం


    Digital Marketing: వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ లాంటి వాటికి డిజిటల్ మార్కెటింగ్ చాలా అవసరం. మీరు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించిన స్కిల్స్ పెంచుకుంటే మీ కూర్చున్నచోటి నుంచే సేవల్ని అందించొచ్చు. డిజిటల్ మార్కెటర్స్‌కి మంచి డిమాండ్ కూడా ఉంది.

    Photography: ఫోటోగ్రఫీ మీ హాబీనా? అయితే మీ ఫోటోలకు డబ్బులు సంపాదించొచ్చు. మీ ఫోటోలు, వీడియోలను కొనే వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. మీకు తెలియాల్సిందల్లా అద్భుతమైన ఫోటోలు క్లిక్ చేయడమే.

    Website: ప్రతీ చిన్న సంస్థ తమకూ ఓ వెబ్‌సైట్ ఉండాలని కోరుకుంటున్న రోజులు ఇవి. అలాంటి వారికి మీరు వెబ్‌సైట్ తయారు చేసి ఇవ్వొచ్చు. స్కిల్స్ పెంచుకుంటే ఒక్కరోజులో ఓ వెబ్‌సైట్ తయారు చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: