Digital India Jobs: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Digital India Jobs: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Digital India Jobs | డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అప్లికేషన్ డెవలపర్, డెవలపర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటీవ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్, ప్రాజెక్ట్ అనలిస్ట్, సీనియర్ డెవలపర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://dic.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

    Digital India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 12
    సీనియర్ అప్లికేషన్ డెవలపర్- 1
    డెవలపర్- 6
    ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటీవ్- 1
    ప్రాజెక్ట్ అనలిస్ట్- 1
    ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- 1
    సీనియర్ డెవలపర్- 2

    RRB Exam Fee Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఫీజు రీఫండ్ చేస్తున్న ఆర్ఆర్‌బీ... ఇలా అప్లై చేయండి

    RRB NTPC Results: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్ రాశారా? మీ మార్కులు ఇలా తెలుసుకోండి


    Digital India Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 16
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 30
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివినవారు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.

    Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే

    UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్‌లో 347 మేనేజర్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    Digital India Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://dic.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో Notifications క్లిక్ చేయాలి. అందులో Openings పైన క్లిక్ చేయాలి.
    అందులో సీనియర్ అప్లికేషన్ డెవలపర్, డెవలపర్ లాంటి పోస్టులతో ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో దరఖాస్తు లింక్ ఉంటుంది.
    దరఖాస్తు లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    అభ్యర్థులు Don't have an account? Register here లింక్ క్లిక్ చేయాలి.
    అభ్యర్థులు తమపూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    ఆ తర్వాత అప్లికేషన్ లింక్ క్లిక్ చేస్తే పోస్టుల వారీగా వేర్వేరు లింక్స్ ఉంటాయి.
    ఆ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయాలి.
    దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: