DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్

DEET App | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఆల్గరిథమ్స్ ద్వారా యూజర్ల క్వాలిఫికేషన్స్‌ని బట్టి జాబ్ రికమండేషన్స్ ఇవ్వడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత.

news18-telugu
Updated: August 31, 2019, 10:46 AM IST
DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్
DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్ (image: DEET)
  • Share this:
నిరుద్యోగులతో పాటు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవాళ్లు మంచి జాబ్స్ వెతుక్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET ప్లాట్‌ఫామ్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభమైన నాలుగురోజుల్లోనే ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్స్ 1,00,000 దాటడం విశేషం. యాప్, వెబ్‌సైట్ ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా... డీట్ నిర్వాహకులు వాటిని వెంటనే పరిష్కరించారు. దీంతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు https://tsdeet.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలను సెర్చ్ చేస్తున్నారు.

ఉద్యోగుల్ని నియమించే సంస్థల్ని, ఉద్యోగాలు కోరుకునేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు డీట్ యాప్, వెబ్‌సైట్ ఉపయోగపడుతున్నాయి. డీట్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినప్పుడే 45,000 పైగా ఉద్యోగాలు సిద్ధంగా ఉండటం విశేషం. డీట్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నవారి తమ అర్హతలకు తగిన జాబ్స్‌ని వెతుక్కోవచ్చు. భవిష్యత్తులో తమ అర్హతలకు తగిన జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే... యూజర్లకు అలర్ట్స్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఆల్గరిథమ్స్ ద్వారా యూజర్ల క్వాలిఫికేషన్స్‌ని బట్టి జాబ్ రికమండేషన్స్ ఇవ్వడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత.

జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, స్విగ్గీ లాంటి బడా కంపెనీలు డీట్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకొని జాబ్ నోటిఫికేషన్స్ అప్‌లోడ్ చేయడం విశేషం. మరి మీరు కూడా డీట్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సులువే. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

UPSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: August 31, 2019, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading