Home /News /jobs /

DIGILOCKER INVITES APPLICATIONS FOR VIRTUAL INTERNSHIPS IN VARIOUS DOMAINS GH VB

DigiLocker: డిజిలాకర్​ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. కోర్సులు, అర్హత, పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Shutters Stock)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Shutters Stock)

DigiLocker: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ​నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డిజిలాకర్ ఇంటర్న్‌షిప్​ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్(Electronics), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మంత్రిత్వ శాఖ (MeitY) ​నిరుద్యోగులకు శుభవార్త(Good News) చెప్పింది. డిజిలాకర్ ఇంటర్న్‌షిప్​ల(Internship) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా స్కీమ్‌(Digital India Scheme)లో భాగంగా గతంలో డిజిలాకర్(Digilocker)​ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పౌరులకు భద్రతతో కూడిన ఆన్​లైన్(Online)​ సేవలను అందిస్తుంది. ఈ ఆన్​లైన్​ సేవలకు సహకారం అందించేందుకు ఇంటర్న్​షిప్​ ఆఫర్(Offer)​ చేస్తుంది. కాగా, డిజిలాకర్​ వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం ఆరు నెలల వ్యవధి కలిగి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఓపెన్​ ఫోర్గ్​ ప్లాట్‌ఫారమ్‌లో వర్క్​ ఫ్రమ్​ హోమ్(Work From Home)​ విధానంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్న్​షిప్​కు ఎంపికైన వారికి ఎటువంటి స్టైఫండ్ ఉండదు. ఇంటర్న్‌షిప్​ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్‌ అందజేస్తుంది.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


జాబ్​ ఓరియెంటెడ్​ స్కిల్స్​ పెంపొందించుకోవడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐటీ సెల్​ ఇంటర్న్​లను నియమించనుంది. డిజిలాకర్​ ఇంటర్న్​షిప్​ను పూర్తి చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిజిలాకర్ ఇంటర్న్‌షిప్ కింద అందుబాటులో ఉన్న కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజిలాకర్​ ఇంటర్న్‌షిప్ కింద అందుబాటులో ఉన్న కోర్సులు..
1. ఫ్రంట్ ఎండ్ డెవలపర్​

2. యూజర్​ ఇంటర్‌ఫేస్ (UI)/ యూజర్​ ఎక్స్​పీరియన్స్​ (UX)

3. గ్రాఫిక్ డిజైనర్

4. ప్రొడక్ట్ మేనేజ్​మెంట్​

5. బ్లాక్‌చెయిన్

6. IoS డెవలప్​మెంట్​ (ఈ కోర్సు నేర్చుకునేందుకు అభ్యర్థులకు మ్యాక్​ సిస్టమ్‌ ఉండాలి)

Yogyata App: రూరల్ యూత్‌కు అద్భుతమైన ఛాన్స్.. యోగ్యత యాప్​ ద్వారా జాబ్​ ఆఫర్.. పూర్తి వివరాలివే..


ఇంటర్న్​షిప్​ నిబంధనలు, షరతులు..
అభ్యర్థుల ప్రాజెక్ట్ అవసరాలను బట్టి ఇంటర్న్​షిప్​ వ్యవధి పొడిగించే అవకాశం ఉంది. కనీసం ఆరు నెలల పాటు ఇంటర్న్​షిప్​ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లు స్వచ్ఛంద ప్రాతిపదికన ఉంటాయి. ప్రోగ్రామ్ వ్యవధిలో ఇంటర్న్‌లకు స్టైపెండ్ ఇవ్వరు. వారి ఉపాధికి ఎటువంటి హామీ ఇవ్వరు. ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇంటర్న్‌లు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ విధానంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌లు OpenForge ప్లాట్‌ఫారమ్‌పై నేర్చుకోవాల్సి ఉంటుంది.

దానిలోనే వారి ప్రాజెక్ట్​ వర్క్ సబ్​మిట్​ చేయాలి. ఇంటర్న్‌షిప్​ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లను అందజేస్తారు. డిజిలాకర్ అనేది భారత ప్రభుత్వం రూపొందించిన పౌర-కేంద్రీకృత అప్లికేషన్. కాబట్టి, డిజిలాకర్​లో ఇంటర్న్​గా పనిచేయడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Digilocker

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు