Home /News /jobs /

DID YOU MISS THE CUTE EXAM DONT WORRY YOU WILL BE HAPPY IF YOU READ NTA WHO GAVE YOU ANOTHER CHANCE UMG GH

CUET -2022: సీయూటీఈ ఎగ్జామ్ మిస్ అయ్యారా ? డోంట్ వర్రీ.. మరోసారి అవకాశం ఇచ్చిన ఎన్టీయే .. చదివితే సంతోషిస్తారు !

సీయూటీఈ  ఎగ్జామ్ మిస్ అయ్యారా ? డోంట్ వర్రీ.. మరోసారి అవకాశం ఇచ్చిన ఎన్టీయే ..

సీయూటీఈ ఎగ్జామ్ మిస్ అయ్యారా ? డోంట్ వర్రీ.. మరోసారి అవకాశం ఇచ్చిన ఎన్టీయే ..

సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ(NTA), సీయూఈటీ‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్(Exam) సెంటర్‌ల మార్పు కారణంగా మొదటి రోజు కీలకమైన పరీక్షకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులక?

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కామన్ యూనివర్శిటీ(University) ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ) సీయూఈటీ‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ సెంటర్‌ల మార్పు కారణంగా మొదటి రోజు కీలకమైన పరీక్షకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు, ఆగస్టులో జరిగే రెండో ఫేజ్‌లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని న్యూజల్‌పైగురి, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎగ్జామ్ సెంటర్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే.

ఈ రెండు కేంద్రాల్లో దాదాపు 190 మంది అభ్యర్థులు పరీక్షలు రాయలేకపోయారు. దీంతో వీరికి ఆగస్టులో జరిగే రెండో దశ పరీక్షలకు హాజరు కావడానికి ఎన్‌టీఏ అనుమతి ఇచ్చింది. అలాగే ఇతర కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్‌ల మార్పు కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు కూడా మరో అవకాశం కల్పిస్తున్నామని NTA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (CUET)-UG తొలి ఎడిషన్ గత శుక్రవారం భారత్ , విదేశాల్లో 510 నగరాల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.సీయూఈటీ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ఫేజ్-1 ఇప్పటికే ప్రారంభం కాగా, ఫేజ్-2 పరీక్షలు ఆగస్ట్‌లో జరగనున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు CUET ఫేజ్- 2లో పరీక్ష రాయనున్నారు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ప్రాధాన్యత ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు
సీయూఈటీ కోసం 14.9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ సగటు రిజిస్ట్రేషన్ 9 లక్షలు మాత్రమే. దీంతో సీయూఈటీ దేశంలోని రెండో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా నిలిచింది. మొదటి స్థానంలో నీట్-యూజీ నిలిచింది. ఈ పరీక్ష కోసం సగటున 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ పరీక్షకు ముందు.. అడ్మిట్ కార్డ్‌ జారీలో ఆలస్యం, ఎగ్జామ్ సెంటర్ ఎంపిక ఇవ్వకపోవడంపై చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందారు. 98 శాతం మంది విద్యార్థులకు వారి ప్రాధాన్యతను బట్టి పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు యూజీసీ(UGC) పేర్కొంది. పర్సంటేజీ సిస్టమ్‌కు విరుద్ధంగా, CUET స్కోర్ పర్సంటైల్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఇది ఇతర అభ్యర్థులకు వ్యతిరేకంగా అభ్యర్థి స్థానాన్ని సూచిస్తుంది.



 కనీసం 60 శాతం మార్కులతో అర్హత!
దేశవ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు 12 స్టేట్ యూనివర్సిటీలు, 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ యూనివర్సిటీలు సైతం సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్‌లను చేపట్టనున్నాయి. దీంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. CUET -2022కి అర్హత పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులను స్కోర్ చేయాల్సి ఉంటుంది.
CUET మొదటి ఎడిషన్ ద్వారా 300కి పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో చేపడుతున్నారు. జూలై 17న నీట్-యూజీ పరీక్ష జరగనుండడంతో ఆ రోజు సీయూఈటీ పరీక్ష ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. మరోపక్క JEE (మెయిన్) పరీక్షల కారణంగా జూలై 21 నుంచి ఆగస్టు 3 మధ్య కూడా సీయూఈటీ పరీక్షలు ఉండవని తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: CUET 2022, Jee main 2022, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు