UPSC Civil Services prelims result 2021: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ షీట్లను upsc.gov.in వెబ్సైటులో అందుబాటులో ఉంచారు.
Union Public Service Commission has declared the result: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్ఎస్ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)–2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల ఆదివారం అంటే 10వ తేదీన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 77 పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati), అనంతపురం (Anantapuram)నగరాల్లో 68 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 40 వేలమంది వరకు హాజరయ్యారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ప్రొటోకాల్‌ను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఆ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్ (Civils Mains)కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం యుపిఎస్సి (UPSc)విడుదల చేసింది. అలాగే మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ షీట్లను upsc.gov.in వెబ్సైటులో అందుబాటులో ఉంచారు.
సివిల్స్ ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం డీటేయిల్డ్ అప్లికేషన్ ఫాం 1(డిఎఎఫ్ 1)ని మరోసా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీలను తర్వాత వెల్లడిస్తామని యుపిఎస్సి తెలిపింది. సివిల్స్ ప్రిమిలినరీ పరీక్షలు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అన్నిపని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011- 23385271, 011 -23098543, 011 -23381125 నెంబర్లకు ఫోన్ చేయాలని యుపిఎస్సి సూచించింది.
Union Public Service Commission has declared the result of Civil Services Preliminary Examination 2021 pic.twitter.com/vVRfSs0ga4
స్టెప్ 1: అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లాగిన్ అవ్వండి
స్టెప్ 2: లాగిన్ అయ్యాక రిజల్ట్ అనే దానిపై క్లిక్ చేయండి
స్టెప్ 3: రిజల్ట్ పై క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీ నెంబర్ చెక్ చేసుకోండి
పరీక్షలో ప్రశ్నల తీరు ఎలా ఉందంటే...
ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి కరెంటు అఫైర్స్ ప్రశ్నలు విభిన్నమైన రీతిలో అడిగారని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. కరోనా నేపథ్యంలో పాండమిక్, ఇండో చైనా సంబంధాలు తదితర అంశాల్లో ప్రశ్నలు ఇబ్బంది పెట్టాయని పరీక్ష రాసిన అభ్యర్థులు ఆ రోజు ఆవేదన వ్యక్తం చేశారు. మేథ్స్, రీజనింగ్, పాసేజ్ రీడింగ్ వంటి అంశాలు కష్టంగా ఉన్నాయి. ప్రశ్నలు దీర్ఘంగా ఉన్నాయి. లాజికల్, రీజనింగ్, అనలటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. గత ఏడాదికన్నా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయన్నారు. మొత్తంగా మూడొంతుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు.
కటాఫ్‌పై అంచనాలు
ప్రిలిమ్స్ కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వేశారు. గత ఏడాది 796 పోస్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 712కు తగ్గింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య తగ్గనుంది. పోస్టుల సంఖ్య తగ్గడంతోపాటు, గత ఏడాదికన్నా ఈసారి ప్రశ్నలు కూడా కష్టంగా ఉన్నందున ఈ ప్రిలిమ్స్ కటాఫ్ 93 నుంచి 95గా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు చెబుతున్నారు. అయితే ఆ అనుమానాలు అన్నింటికీ బ్రేక్ వేస్తూ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి.. మార్కులు, ఆన్సర్ షీట్లు, కటాఫ్ మార్కులు అన్నీupsc.gov.in వెబ్సైటులో అందుబాటులో ఉంచారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.