హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MBBS Alternatives: నీట్‌‌లో మంచి స్కోర్ రాలేదా? MBBSను మించిన మంచి కెరీర్‌ ఆప్షన్స్ ఇవే

MBBS Alternatives: నీట్‌‌లో మంచి స్కోర్ రాలేదా? MBBSను మించిన మంచి కెరీర్‌ ఆప్షన్స్ ఇవే

MBBS Alternatives: నీట్‌‌లో మంచి స్కోర్ రాలేదా? MBBSను మించిన మంచి కెరీర్‌ ఆప్షన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

MBBS Alternatives: నీట్‌‌లో మంచి స్కోర్ రాలేదా? MBBSను మించిన మంచి కెరీర్‌ ఆప్షన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

MBBS Alternatives | నీట్ 2021 ఎగ్జామ్‌లో మార్కులు తక్కువగా వచ్చాయా? ఎక్కువగా స్కోర్ (Neet 2021 Score) చేయలేకపోయారా? ఎంబీబీఎస్ చదివే అవకాశం రాలేదని ఆలోచిస్తున్నారా? అంతకన్నా మించి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్-2021 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. పరీక్షలో మెరిట్‌లో అర్హత సాధించిన వారికి MBBS చదివే అవకాశం లభిస్తుంది. భారతదేశంలో దాదాపు 550 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం దాదాపు 80,000 మందికి ఏటా వైద్య విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 10-15 లక్షల మంది విద్యార్థులు NEET UG పరీక్షకు హాజరవుతారు. అంటే పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో 10% కంటే తక్కువ మందికి వైద్య కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల చాలామంది విద్యార్థులు నీట్‌లో క్వాలిఫై అవ్వకపోవచ్చు. అయితే ఇలాంటి వారు సైతం హెల్త్ కేర్ సెక్టార్‌లో కెరీర్‌ను ఎంచుకోవచ్చు. నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేని లేదా బాగా స్కోర్ చేయలేని విద్యార్థులు ఈ కెరీర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు... విద్యార్హతల వివరాలివే

ఆయుష్ డాక్టర్


నీట్‌లో అర్హత సాధించలేకపోయిన విద్యార్థులు భారతీయ సాంప్రదాయ వైద్య విధానాన్ని అందిపుచ్చుకుంటూ ఆయుష్ డాక్టర్‌ కావచ్చు. ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా ఐదున్నర సంవత్సరాల వైద్యవిద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సైన్స్ (BNYS), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS).. వంటి కోర్సులను విద్యార్థులు ఎంచుకోవచ్చు.

Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే

పారామెడికల్ కోర్సులు


ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అనేక రకాల పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఫిజియోథెరపీ (BPT), ఆక్యుపేషనల్ థెరపీ (BOT), బ్యాచిలర్ ఆఫ్ స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ & ఆడియాలజీ (BSLPA).. రేడియోగ్రఫీ, ఆప్టోమెట్రీ, మెడికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ టెక్, కార్డియాక్, డయాలసిస్ టెక్, పబ్లిక్ హెల్త్, న్యూక్లియర్ మెడిసిన్‌లో BScలను ఎంచుకోవచ్చు. ఆర్థోటిక్స్ & ప్రోస్తేటిక్స్, స్పోర్ట్స్ సైన్స్ వంటి ఇతర ఆప్షన్లు సైతం ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వంటి అనేక స్వల్పకాలిక పారామెడికల్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.

IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు... ఇలా అప్లై చేయండి

బయోటెక్నాలజీ


బయోటెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకునే విద్యార్థులు మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, జెనెటిక్స్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ వంటి అంశాలపై విస్తృత పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఇది వారి కెరీర్‌కు మెరుగైన భరోసా కల్పిస్తుంది. కాలేజీ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బయోటెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఈ రిసెర్చ్ బేస్డ్ విభాగంలో మెడిసిన్, FMCG, రిసెర్చ్ వంటి రంగాల్లో వైవిధ్యమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

Ayush Recruitment 2021: ఆయుష్ శాఖలో ఉద్యోగాలు... రూ.70,000 వరకు వేతనం

న్యూట్రిషన్, డైటెటిక్స్


ఈ రంగంలో UG ప్రోగ్రామ్ (B.Sc. ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్) ద్వారా ఫుడ్ మేనేజ్‌మెంట్, న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి విభాగాలను నేర్చుకుంటారు. ఈ కోర్సు ప్రధానంగా శరీరం, ఆహారం మధ్య సంబంధంపై దృష్టి పెడుతుంది. కోర్సు వ్యవధి 3 నుంచి 4.5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆహార మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? సరైన ఆహారం, పోషకాహారంతో వ్యాధుల ప్రమాదాలను ఎలా తగ్గించుకోవాలి? వంటి అంశాను విద్యార్థులు తెలుసుకుంటారు. ఈ కోర్సుకు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది.

జీవ శాస్త్రాలు


లైఫ్, లివింగ్ ఆర్గానిజం (జీవుల) గురించి లోతుగా అధ్యయనం చేయాలనుకుంటే.. బయోలాజికల్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. జీవ రూపాలు, నిర్మాణం, పని, అభివృద్ధి, పెరుగుదల, మూలం, పరిణామం, పంపిణీ.. వంటి వివిధ అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. UG కోర్సు (B.Sc - బయోలాజికల్ సైన్స్) విద్యార్థులు ఫార్మాస్యూటికల్స్, సంబంధిత పరిశ్రమల్లో పరిశోధన చేయవచ్చు.

First published:

Tags: CAREER, NEET, NEET 2021

ఉత్తమ కథలు