ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్చువల్ క్లాస్‌‌లు...

విద్యార్థులతో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ

విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలతోపాటు గతంలో వాయిదా పడిన పేరెంట్ టీచర్ మీటింగ్స్ ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.

 • Share this:
  దేశంలోని అత్యంత ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఒకటైన ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు నేటి నుంచి లైవ్ క్లాస్‌రూమ్ టీచింగ్‌ను ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా విద్యార్థులు లైవ్‌లో పాఠాలు వినవచ్చు. అటెండెన్స్ కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. రిలయన్స్ జియో అందిస్తున్న ఇంటర్నెట్ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ బృందం అందిస్తున్న సహకారంతో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ప్లాట్ ఫాం ద్వారా టీచర్లు కూడా పరస్పరం కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో వైట్ బోర్డును ఉపయోగించి ఈ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

  విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు


  పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు రోజు మొత్తం కొనసాగాయి. వచ్చే నాలుగైదు రోజుల పాటు స్కూల్ యాజమాన్యం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించనుంది. మార్చి 13 నుంచి 25 వరకు స్కూల్‌కు సెలవులు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్లాస్‌లు షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో పాఠశాలలో అందుకు తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. టీచర్లకు కూడా ఆన్‌లైన్ పాఠాలపై గత కొన్ని రోజులుగా శిక్షణ ఇచ్చారు. టీచర్లు కూడా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా నేర్చుకున్నారు.

  విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు


  ఈ సందర్భంగా ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ & చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రారంభోపన్యానం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, అదే సమయంలో విద్యాసంవత్సరం కూడా ప్రారంభం కావాల్సిన పరిస్థితుల్లో, విద్యార్థులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఇలా ఆన్‌లైన్ ద్వారా క్లాస్‌లు ప్రారంభించినట్టు నీతా అంబానీ తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో అంతర్జాతీయ బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయన్నారు. అలాగే, సుమారు వంద కోట్ల మంది విద్యార్థుల మీద ప్రభావం పడిందన్నారు. ధీరూబాయ్ అంబానీ స్కూల్ కూడా విద్యార్థుల క్షేమం గురించి తీవ్ర ఆందోళనతో ఉందని తెలిపారు.

  ‘దేశం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండడం ప్రధానం. ఇంటి వద్దే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండండి. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ తమ విద్యార్థుల క్షేమాన్ని కాంక్షిస్తోంది. మన పిల్లల పట్ల మనం శ్రద్ధ చూపించడానికి ఇదే సరైన సమయం. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలని వారికి నేర్పాలి. వారిలో ఆశలను చిగురింపజేయాలి. స్కూల్ మూసి ఉన్నా ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పించడం ద్వారా ధీరూబాయ్ అంబానీ స్కూల్ విద్యార్థుల క్షేమానికి, విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది.’ అని నీతా అంబానీ ప్రకటించారు.

  ‘నా ప్రియమైన విద్యార్థులను కూడా నేను స్కూల్లో మిస్ అవుతున్నా. మన భద్రత కన్నా మనకి మరేదీ ముఖ్యం కాదు. మీ యోగక్షేమాలే ప్రధానం. మీ టీచర్లు, స్నేహితులు, ధీరూబాయ్ అంబానీ స్కూల్ మొత్తం మీవెంటే ఉందని గుర్తుంచుకోండి. ఈ పోరాటంలో మనం జయిస్తాం. మళ్లీ మంచిరోజులు వస్తాయి.’ అని విద్యార్థులను ఉద్దేశించి నీతా అంబానీ అన్నారు.

  విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలతోపాటు గతంలో వాయిదా పడిన పేరెంట్ టీచర్ మీటింగ్స్ ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published: