హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DGPM Recruitment 2021 : డీజీపీఎంలో 24 ఉద్యోగాలు.. జీతం రూ. 81,000

DGPM Recruitment 2021 : డీజీపీఎంలో 24 ఉద్యోగాలు.. జీతం రూ. 81,000

డీజీపీఎం ఉద్యోగాలు

డీజీపీఎం ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన సెంట్ర‌ల్ బోర్డ్ ఆప్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్‌కి చెందిన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ప‌ర్ఫామెన్స్ మేనేజ‌మెంట్ (Directorate General of Performance Management) విభాగంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ద‌ర‌ఖాస్తుకు నవంబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  భార‌త ప్ర‌భుత్వానికి చెందిన సెంట్ర‌ల్ బోర్డ్ ఆప్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్‌కి చెందిన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ప‌ర్ఫామెన్స్ మేనేజ‌మెంట్ (Directorate General of Performance Management) విభాగంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో టాక్స్ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-2, హ‌వ‌ల్దార్‌, ఎంటీఎస్ విభాగాల్లో 24 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి విభాగాల ఆధారంగా జీతం రూ.18,000 నుంచి రూ. 81,000 వ‌ర‌కు ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌ (Offline) ద్వారానే ఉంటుంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్ర‌య కోసం అధికారిక వెబ్‌సైట్ https://dgpm.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

  అర్హ‌త‌లు.. ఖాళీల స‌మాచారం..

  పోస్టుపేరుఅర్హ‌త‌లుఖాళీలు
  టాక్స్ అసిస్టెంట్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ వ‌చ్చి ఉండాలి.10
  స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-2గుర్తింపు పొందిన బోర్డులో ఇంట‌ర్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ వ‌చ్చి ఉండాలి.01
  హ‌వ‌ల్దార్‌ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి. సంస్థ నిర్దేశించిన శారీర‌క ప్రామాణాలు క‌లిగి ఉండాలి.10
  ఎంటీఎస్గుర్తింపు పొందిన బోర్డులో ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి.03


  ఎంపిక విధానం..

  Step 1 :  అభ్య‌ర్థి ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు పంపాలి.

  Step 2 :  ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి అర్హుల‌ను మెరిట్ ఆధారంగా, క్రీడ‌ల్లో వారి సామ‌ర్థ్యాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  IGNOU Recruitment 2021: ఇగ్నోలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎంపిక‌, ద‌ర‌ఖాస్తు విధానం


  Step 3 :  షార్ట్‌లిస్ట్ అభ్య‌ర్థులను పోస్టుల ఆధారంగా ఫిజిక‌ల్ టెస్ట్ లేదా టైపింగ్, స్కిల్ టెస్టు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

  ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాలు..

  - వయస్సు రుజువు కొరకు మెట్రిక్యులేషన్/SSC లేదా తత్సమాన సర్టిఫికేట్.

  - విద్యార్హతలకు మద్దతుగా ధృవపత్రాలు.

  - అవ‌స‌ర‌మైన‌ స్పోర్ట్స్/గేమ్స్ సర్టిఫికేట్లు

  - SC/ST/OBC కుల ధృవీకరణ పత్రం.

  - ఆధార్ కార్డు కాపీ.

  ద‌ర‌ఖాస్తు విధానం.. ముఖ్య స‌మాచారం

  Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది.

  Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dgpm.gov.in/ ను సంద‌ర్శించాలి.

  Step 3 : అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4 : అర్హ‌త ఉన్న పోస్టుల‌ను ఎంపిక చేసుకోవాలి.

  Step 5 : అనంత‌రం నోటిఫికేష‌న్‌లోని అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.

  Step 6 : త‌ప్పులు లేకుండా అప్లికేష‌న్ ఫాంను నింపాలి.

  Step 7 : పోస్టుకు అవ‌స‌ర‌మై డాక్యుమెంట్ల‌ను జ‌త చేసి

  Directorate General of Performance Management

  Central Board of Indirect Taxes and Customs,

  5th floor, Drum Shape Building, IP Bhawan,

  IP Estate, New Delhi-110002 అడ్ర‌స్‌కు పంపాలి.

  Step 8 : ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు