DRDO Jobs 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... డిప్లొమా, బీటెక్ అర్హత

DRDO Recruitment 2020 | కర్నాటకలోని మైసూరులో ఉన్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DFRL సంస్థలో ఖాళీల భర్తీకి డీఆర్‌డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 25, 2020, 11:21 AM IST
DRDO Jobs 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... డిప్లొమా, బీటెక్ అర్హత
DRDO Jobs 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... డిప్లొమా, బీటెక్ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిప్లొమా, బీటెక్ లాంటి కోర్సులు పాసైనవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్నిభర్తీ చేస్తోంది. మొత్తం 15 పోస్టులున్నాయి. డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DFRL కోసం ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల కాల వ్యవధి ఏడాది మాత్రమే. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 14 చివరి తేదీ. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకు 2020 నవంబర్ 13న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని, ఫామ్ పూర్తి చేసి head.hrd@dfrl.drdo.in ఇమెయిల్ ఐడీకి చివరి తేదీ లోగా పంపాలి. అభ్యర్థులు తప్పనిసరిగా https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 జాబ్స్... డిగ్రీ పాసైనవారికి అవకాశం

Indian Navy Jobs 2020: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే


మొత్తం ఖాళీలు- 15

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 3
బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 2బీఎస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ లేదా బీటెక్ ఇన్ ఫుడ్ టెక్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్- 1

టెక్నీషియన్ అప్రెంటీస్- 12
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 1
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 1
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ లేదా కేటరింగ్ టెక్నాలజీ- 4
డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేషన్- 1
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ లేదా ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ- 1
డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రీషియన్- 1
డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 1
డిప్లొమా ఇన్ బేకింగ్ టెక్నాలజీ- 1
డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ- 1

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 171 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 1,11,093 ఖాళీలు... ప్రకటించిన ప్రభుత్వం

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 14
వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 నవంబర్ 13
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.9000, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.8000.
విద్యార్హత- 2017, 2018, 2019 సంవత్సరాల్లో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా పాసైనవారు మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: September 25, 2020, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading