Jobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

Jobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ (ప్రతీకాత్మక చిత్రం)

Jobs | సరికొత్త ట్రెండ్‌కు తగ్గ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి. కరోనా వైరస్ సంక్షోభంలో కూడా కొన్ని ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ జాబ్స్ ఏవో తెలుసుకోండి.

 • Share this:
  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే, ఇంకొన్ని కంపెనీలు జీతాల్లో కోత విధిస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం అలాంటిది. ఈ సమయంలో తమ జాబ్స్ పదిలంగా ఉంటే చాలనుకుంటున్నారు ఉద్యోగులు. కొత్త ఉద్యోగాల ఆలోచనే లేదు. కంపెనీలు కూడా నియామకాలు చేపట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఇంతటి కష్టకాలంలో కూడా కొన్ని ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని టెక్ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాలకు ఢోకా లేదంటున్నారు నిపుణులు. క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్ ఆర్కిటెక్ట్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్స్, ఆగ్యుమెంటెడ్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎక్స్‌పర్ట్స్ లాంటి స్కిల్స్ ఉన్నవారికి ఇప్పుడు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఆ స్కిల్స్ గురించి వివరంగా తెలుసుకోండి.

  1. Network architect/engineer: కంప్యూటర్ నెట్వర్క్స్‌ని ప్లాన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం నెట్వర్క్ ఆర్కిటెక్ట్ పని. డేటా, వాయిస్, కాల్స్, వైర్‌లెస్ నెట్వర్క్స లాంటివన్నీ ఇందులోనే ఉంటాయి. నిరంతరాయంగా కనెక్టివిటీ, నెట్వర్క్ ఎర్రర్స్‌ని ట్రబుల్ షూట్ చేయడం లాంటి బాధ్యతలన్నీ వీరివే. యాక్సెంచర్, టెక్ మహీంద్రా లాంటి టెక్ సంస్థల్లో వీరికి మంచి డిమాండ్ ఉంటుంది.

  2. AR/VR engineer: రియల్ వాల్డ్‌కు ఇంకాస్త మెరుగులు దిద్దడం ఆగ్యుమెంటెడ్ రియాల్టీ అయితే మిమ్మల్ని త్రీడీ ప్రపంచంలోకి తీసుకెళ్లడం వర్చువల్ రియాల్టీ స్పెషాలిటీ. అందుకే పెద్దపెద్ద టెక్ కంపెనీల్లో ఏఆర్, వీఆర్ ఇంజనీర్లకు కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది. కరోనా వైరస్ సంక్షోభం తర్వాత వీరి డిమాండ్ రెండింతలు ఉంటుందని అంచనా. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీల్లో వీరికి ఎప్పటికీ అవకాశాలుంటాయి.

  3. Full stack developer: యూజర్ల బిజినెస్‌తో పాటు టెక్నికల్ అంశాల్లో సహకారం అందించడంలో ఫుల్ స్టాక్ డెవలపర్‌ది కీలక పాత్ర. పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, MySql లాంటి డేటాబేస్ లాంగ్వేజ్‌లో పట్టు ఉండాలి. అనేక సంస్థల్లో వీరికి మంచి డిమాండ్ ఉంటుంది.

  4. Cloud computing: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఐటీ కంపెనీలన్నీ క్లౌడ్‌ పైన ఎక్కువగా దృష్టిపెట్టాయి. వీలైనంత త్వరగా క్లౌడ్‌లోకి మారాలని నిర్ణయించుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌ స్కిల్స్ ఉన్నవారికి గూగుల్, ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి.

  5. AI, Data science and ML: ఈ మూడు స్కిల్స్ ఉన్నవారికి అనేక కంపెనీల్లో డిమాండ్ ఉంది. ఆస్పత్రులు, బ్యాంకులు, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ఆవిష్కరణలకు డేటా సైంటిస్టులు కీలకం.

  Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

  Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలు
  Published by:Santhosh Kumar S
  First published: