Home /News /jobs /

Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs | రంగారెడ్డి జిల్లాలో పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్-రంగారెడ్డి పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ కమ్ ప్రొబెషన్ ఆఫీసర్, ఔట్ రీచ్ వర్కర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application process) కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2021 నవంబర్ 20 లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా

    Telangana Jobs: ఖాళీల వివరాలు ఇవే...











































































    మొత్తం ఖాళీలు 27 విద్యార్హతలు వయస్సు వేతనం
    లీగల్ కమ్ ప్రొబెషన్ ఆఫీసర్ 1 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా (ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం) 25 నుంచి 35 ఏళ్లు రూ.21,000
    ఔట్ రీచ్ వర్కర్ (మేల్) 1 బ్యాచిలర్స్ డిగ్రీ 25 నుంచి 35 ఏళ్లు రూ.10,000
    డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ డీసీపీయూ 1 బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీడీసీఏ 25 నుంచి 35 ఏళ్లు రూ.8,000
    డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ సీడబ్ల్యూసీ 1 బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీడీసీఏ 25 నుంచి 35 ఏళ్లు రూ.9,000
    ఎస్ఏఏ మేనేజర్ 1 మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), సోషియాలజీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, ఎంఎస్‌సీ హోమ్ సైన్స్ 25 నుంచి 35 ఏళ్లు రూ.17,500
    సోషల్ వర్కర్ 1 సోషల్ వర్క్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ. 25 నుంచి 35 ఏళ్లు రూ.14,000
    ఆయా 17 వంట చేయడం, హౌజ్‌కీపింగ్ తెలిసి ఉండాలి. 25 నుంచి 35 ఏళ్లు రూ.9,000
    చౌకీదార్ 3 - - -
    ఏఎన్ఎం 1 ఏఎన్ఎం సంబంధిత క్వాలిఫికేషన్స్ 25 నుంచి 50 ఏళ్లు రూ.6,000

    LIC Recruitment 2021: ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

    Telangana Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ.

    దరఖాస్తు విధానం- https://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్‌లో జాబ్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్ చివర్లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాలి.

    ఈ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    O/o District Welfare Officer,
    Women, Child, Disabled & Senior Citizen Department,
    H.No: 8-3-222, Vengalrao Nagar,
    Yousufguda Road, Near Mathuranagar Metro Station,
    Rangareddy District,
    PIN Code- 500038.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు