HOME »NEWS »JOBS & EDUCATION »department of railways issued notification for various jobs bn

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జేఈలకు సంబంధించి 617 పోస్టులను భర్తీ చేయనుంది.

  • Share this:
    నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లోకో పైలట్, టికెట్ క్లర్కుతో పాటు పలు ఉద్యోగాలకు సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జేఈలకు సంబంధించి 617 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మే 2020గా పేర్కొంది.

    దరఖాస్తు విధానం..


    ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/12వ తరగతి, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మే 23, 2020లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 47 ఏళ్ల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఏలాంటి ఫీజు అవసరం లేదు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://ecr.indianrailways.gov.in ను సంప్రదించొచ్చు.

    ప్రధాన తేదీలు..
    ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 మార్చి 2020
    దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మే 2020
    Published by:Narsimha Badhini
    First published:May 16, 2020, 15:20 IST

    टॉप स्टोरीज