3 Day week off: వారానికి 3 రోజులు సెలవులు... చట్టం చేయాలని డిమాండ్లు

వారానికి 3 రోజులు సెలవులు... చట్టం చేయాలని డిమాండ్లు (image - credit - twitter - reuters business)

3 Day week off: జనరల్‌గా మనం రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడానికి ఇష్టపడం. కానీ అలా కూడా ఆలోచిస్తే... ఫలితాలు బాగుంటాయని వారానికి మూడు రోజుల సెలవులు నిరూపిస్తున్నాయా?

  • Share this:
    Japan News: వారానికి 3 రోజులు సెలవులు... 4 రోజులు మాత్రమే పని దినాలు అనే ఆప్షన్ వినడానికి ఉద్యోగులకు ఆనందంగా ఉంటుంది. యాజమాన్యాలకు మాత్రం నచ్చదు. వారానికి 2 రోజులు సెలవులు ఇవ్వడమే ఎక్కువ... ఇక 3 రోజులు కావాలా అని ఫైర్ అవుతాయి. కానీ... జపాన్ ప్రభుత్వం మాత్రం ఇలా భిన్నంగా ఆలోచించడానికి వెనకాడలేదు. అసలు ఇది ఎలా ఉంటుందో చూద్దామని అమలు చేసింది. ఉద్యోగులకు 4 రోజులే పని దినాలు ఇచ్చి... వారానికి 3 రోజులు సెలవులు ఇచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఫలితాలు అదిరిపోయాయి. అక్కడ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అందువల్ల దీన్ని చట్టం చెయ్యాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బిల్లు పెడితే... వెంటనే ఆమోదిస్తామని అంటున్నారు.

    కష్టే ఫలి:
    జనరల్‌గా జపనీయులు బాగా కష్టపడతారు. కష్టపడటమే వాళ్లకు ఇష్టం. చిన్నప్పటి నుంచే స్కూల్ డేస్‌లోనే కష్టపడటం అలవాటు చేస్తారు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం నేర్పిస్తారు. అందువల్ల జపనీస్ కుర్రాళ్లు పెరిగే కొద్దీ పనులు చేయడంలో ముందుంటారు. అందుకే 2 అణుబాంబులు పడినా, సునామీలు, భూకంపాలూ వస్తున్నా... ముసలివారి సంఖ్య బాగా పెరిగిపోయినా ఆ దేశం... ప్రపంచ దేశాలతో బలంగా పోటీపడగలుగుతోంది. నాణ్యమైన వస్తువులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. అలాంటి జపాన్‌లో ప్రస్తుతం వారానికి 2 రోజుల సెలవులు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో వారానికి 3 రోజులు సెలవులు ఇస్తే... ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తుండటాన్ని గమనించాయి కంపెనీలు. దాంతో జపాన్‌లోనూ అమలుచేసి చూశారు. మంచి ఫలితాలు వస్తున్నాయి.

    ఎందుకీ మార్పు:
    జపాన్ ప్రజలు ఎక్కువ ఆదాయం కోసం అదనపు పనిగంటలు పనిచేస్తున్నారు. అలా పనిచేస్తూనే ఆఫీసుల్లోనే నిద్రపోతున్నారు. అక్కడే గడిపేస్తున్నారు. డబుల్ షిఫ్టులు చేస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యం పాడవ్వడమే కాదు... మానసిక సమస్యలూ పెరుగుతున్నాయి. ఫ్యామిలీతో గడపలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం 3 రోజుల సెలవు దినాల రూల్ తేవాలనుకుంటోంది. తద్వారా కనీసం వారానికి 2 రోజులైనా ఇళ్లలో గడుపుతారని అనుకుంటోంది.

    ఇది కూడా చదవండి: AP CM YS Jagan: ఏపీలో గ్రామాలకు మరో వరం... సీఎం జగన్ ఆదేశాలు

    కరోనా ఎఫెక్ట్:
    కరోనాకి ముందే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెచ్చి అమలుచేసి చూసింది. కరోనా రావడంతో ఈ ప్రతిపాదన అమల్లోకి రాకుండా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా బాగా తగ్గిపోయింది కాబట్టి దీన్ని అమల్లోకి తేవాలని అంటున్నారు. ఇప్పటికే జపాన్‌లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్... 2019 ఆగస్టులో 3 రోజుల సెలవులు తెచ్చి... సక్సెస్ సాధించింది. జపాన్ ప్రభుత్వం గనుక చట్టం చేస్తే... ఇక అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులే పని చేస్తారు. ఆ తర్వాత వారి ఇష్టం. అదే జరిగితే ప్రపంచ దేశాలు కూడా ఈ దిశగా ఆలోచించే అవకాశాలు ఉంటాయంటున్నారు విశ్లేషకులు.
    Published by:Krishna Kumar N
    First published: