Home /News /jobs /

DEMAND INCREASING FOR CLOUD PROFESSIONALS IN INDIA SAYS NASSCOM REPORT SS GH

Cloud Professionals: భారత్‌లో క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్... 2025 నాటికి 20 లక్షల మంది అవసరం

Cloud Professionals: భారత్‌లో క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్... 2025 నాటికి 20 లక్షల మంది అవసరం
(ప్రతీకాత్మక చిత్రం)

Cloud Professionals: భారత్‌లో క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్... 2025 నాటికి 20 లక్షల మంది అవసరం (ప్రతీకాత్మక చిత్రం)

Cloud Professionals | భారతదేశంలో క్లౌడ్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. 2025 నాటికి ఇండియాలో 20 లక్షలకు పైగా క్లౌడ్ ప్రొఫెషనల్స్‌ (Cloud Professionals) అవసరమని నాస్కామ్ నివేదిక వెల్లడించింది.

ఇటీవల కాలంలో ఐటీ సెక్టార్‌లో భారత్ దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్లౌడ్ టాలెంట్ విభాగంలో భారత ఐటీ నిపుణులు అగ్ర శ్రేణిలో ఉన్నారు. తాజాగా ఐటీ పరిశ్రమ సంస్థ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్లౌడ్ టాలెంట్ హబ్‌గా భారత్ అవతరించే అవకాశముందని నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్ 6,08,000 మంది (2021 ఆర్థిక సంవత్సరం) క్లౌడ్ నిపుణులతో (Cloud Professionals) ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉందని నివేదికలో పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 14 నుంచి 15 లక్షల క్లౌడ్ నిపుణుల బైస్ లైన్ గ్రోత్ ఉంటుందని ‘క్లౌడ్ స్కిల్స్: పవరింగ్ ఇండియా డీఎన్ఏ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక అంచనా వేసింది. అయితే 2025 నాటి 20 లక్షలకు పైగా ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందని స్పష్టం చేసింది.

సంవత్సరానికి 26 శాతం వృద్ధితో భారత క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వేగవంతమైన డిజిటల్ యాక్సలరేషన్, అవసరాన్ని బట్టి డిమాండ్, క్లౌడ్ ఆధారిత సేవలకు వలసల వల్ల ఎస్ఎంఈలు, సంస్థలకు గణనీయమైన పోటీ ప్రయోజనాలు అందనున్నాయని, మౌలిక సదుపాయాలు, ఫ్లెక్సిబిలిటీ, తక్కువ ఖర్చుల లాంటి క్లౌడ్ మార్కెట్ వృద్ధికి దోహదపడిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహమ్మారి తర్వాత ఈ పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది.

Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ఇండియన్ సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్(SaaS) స్టార్టప్ ఎకో సిస్టం క్లౌడ్ డిమాండ్‌కు మరో వనరుగా మారింది. భారత్‌లో ఈ SaaS కంపెనీలు జాబ్ డొమైన్లలో 40 వేల మంది నిపుణులను నియమించాయి. ఇవి ఇతర టెక్ స్టార్టప్ విభాగాల కంటే ఎక్కువని నాస్కామ్ తెలిపింది. 30 శాతం వృద్ధి రేటుతో భారత్ తన క్లౌడ్ టాలెంట్ పూల్‌ను 1.7 నుంచి 1.8 మిలియన్లకు పెంచుకోగలదని, ఈ ప్రక్రియలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్లౌడ్ టాలెంట్ హబ్‌గా అవతరిస్తుందని నివేదిక అంచనా వేసింది.

NIACL Recruitment 2021: న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో 300 ఉద్యోగాలు... అప్లై చేయండిలా

క్లౌడ్ రిలేటివ్ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ కు మారిందని, వనరులను యాక్సెస్ చేయడానికి డిమాండ్ వీలు కల్పిస్తుందని నాస్కామ్ అధ్యక్షులు దేబ్జానీ ఘోష్ అన్నారు. క్లౌడ్ సొల్యూషన్స్ కోసం గ్లోబల్ హబ్ గా భారత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలంటే కేంద్రీకృత పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం, పెద్ద ఎత్తున నైపుణ్యం కీలకమని ఆమె తెలిపారు.

క్లౌడ్ సొల్యూషన్స్ డిమాండ్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోందని, క్లౌడ్ టాలెంట్ కు కూడా అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక పేర్కొంది. 2020 క్లౌడ్ రోల్స్ కోసం భారత్ లో దాదాపు 380,000 ఉద్యోగ అవకాశాలు లభించాయని, 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధి గతేడాది నమోదైందని తెలిపింది. క్లౌడ్ నైపుణ్యాల డిమాండ్ ప్రస్తుత సరఫరా కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Information Technology, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు